సిగరెట్లు అమ్మలేదని భారత సంతతి వ్యక్తిని చంపేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: సిగరెట్లు విక్రయించలేదనే ఆగ్రహంతో మైనర్లు భారత సంతతి దుకాణుదారు హత్య చేశారు. ఈ సంఘటన ఉత్తర లండన్‌లో జరిగింది. మిల్ హిల్ ఏరియాలో విజయ్ పటేల్ అనే 49 ఏళ్ల వ్యక్తి శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు.

యుకె టీనేజర్ల దాడిలో గాయపడిన విజయ్ పటేల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను సోమవారంనాడు మరణించాడు. దాడిలో పాల్గొన్నవారిని పట్టుకోవాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు పటేల్ ఆస్పత్రిలో పడకపై ఉన్న మృతదేహం, లైఫ్ సపోర్ట్ మిషన్‌కు తగిలించి ఉన్న వైనం ఫొటోలను విడుదల చేశారు.

Indian-Origin Man Refused To Sell Cigarettes To UK Teens, Beaten To Death

విజయ్ పటేల్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పటేల్ హత్య కేసులో 16 ఏళ్ల బాలుడు కోర్టుకు హాజరయ్యాడు. ముగ్గురు వ్యక్తులు పటేల్‌పై దాడి చేశారని, సమాచారం సేకరిస్తున్నామని స్కాట్లాండ్ యార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.

పటేల్ ఛాతీపై వారు పిడిగుద్దులు గుద్దినట్లు తెలుస్తోంది. దానివల్ల అతను వెనక్కి పడిపయాడు. పటేల్ 2006లో తన భార్య విభతో కలిసి లండన్ వచ్చాడు. ఈ దాడి జరిగిన సమయంలో భార్య భారత్‌లో ఉన్నరు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Indian-origin shopkeeper was killed after he was punched for refusing to serve cigarette paper to under-age UK teenagers at his shop in north London.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి