NRI News: న్యూజెర్సీలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..
తెలుగు వారు ఎక్కడున్నా మన సంప్రదాయాలను మరిచిపోరు. మన సంస్కృతిని పాటిస్తుంటారు. మన పండుగలను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మను ఎంత బాగా జరుపుకున్నారో చూశాం. ఆ తర్వాత దసరా, దీపావళి కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీ సాయిదత్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగర్ మంగ్లీ హాజరయ్యారు.
ఆమె పాడిన శివ పాటలతో అందరు శివ భక్తిలో మునిగిపోయారు. అంతకు ముందు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) న్యూజెర్సీలో ప్రజల భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. న్యూజెర్సీలోని వారెన్ పట్టణ పోలీసు అధికారి డిటెక్టివ్ సార్జంట్ జోసెఫ్ కోహెన్ నిర్వహించారు. దొంగతనాలు, దోపిడిలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలి..? క్రిమినల్స్ ఎలాంటి ఇళ్లపై కన్నేస్తారు..? సెలవులపై వెళ్లేటప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలి..? అనే దానిపై ఈ అవగాహన సదస్సులో వివరించారు.

అలాగే ఇంటి ఆవరణలో ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు ఉండాలి.? ఒక వేళ దొంగతనం, దోపిడి జరిగితే ఎలా స్పందించాలనే దాని కూడా సమావేశానికి హాజరైన వారికి వివరుంచారు. తెలుగు వారందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications