NRI News: మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ యాజమాని రవి ఉప్పల్ అరెస్ట్

మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ఇద్దరు ప్రధాన యజమానులలో ఒకరైన రవి ఉప్పల్‌ అరెస్ట్ అయ్యారు. ED ఆదేశాల మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ నోటీసు ఆధారంగా దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఉప్పల్ గత వారం దుబాయ్ వెళ్లాడు. అక్కడే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని భారతదేశానికి రప్పించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దుబాయ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తా సంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

ఉప్పల్ మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్‌పై కిక్‌బ్యాక్ ఆరోపణలు వచ్చిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో యూఏఈలో ఉన్న ఉప్పల్, ఇతర ప్రమోటర్, అక్రమ బెట్టింగ్ సిండికేట్ సూత్రధారి సౌరభ్ చంద్రకర్‌లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాయ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించి, వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్ పొందడంతో నిందితులిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించింది.

Mahadev online betting app owner Ravi Uppal has been arrested in Dubai

ఉప్పల్ అరెస్ట్ తర్వాత చంద్రాకర్ త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ ఫిబ్రవరిలో జరిగిన విలాసవంతమైన వివాహం జరిగింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. రాస్ అల్ ఖైమాలో జరిగిన తన వివాహ వేడుకలో, చంద్రకర్ తన కుటుంబ సభ్యులను నాగ్‌పూర్ నుండి UAEకి తీసుకెళ్లడానికి ప్రైవేట్ జెట్‌లను అద్దెకు తీసుకున్నాడు.

చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ప్రదర్శనలు ఇప్పించాడని ED తెలిపింది.చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన చంద్రకర్‌, ఉప్పల్‌లు మహాదేవ్‌ బెట్టింగ్‌ ప్లాట్‌ఫారమ్‌కు ఇద్దరు ప్రధాన ప్రమోటర్లు, దుబాయ్‌ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఈడీ తెలిపింది.ఏజెన్సీ ఇటీవల రాయ్‌పూర్, భోపాల్, ముంబై మరియు కోల్‌కతాలోని 39 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి రూ.417 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+