Hart Attack: అమెరికాలో వైద్య విద్యార్థికి గుండె పోటు.. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూసిన యువతి..

రాష్ట్రంలోని యువతలో గుండె పోటు రావడం ఆందోళన కలిగిస్తుంది. మొన్నటి మొన్న పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఓ హల్ది ఫంక్షన్ లో ఓ వ్యక్తి ఉన్నట్టుండి కింద పడిపోయి చనిపోయాడు. మరో ఘటనలో ఓ వ్యక్తి బ్యాట్మెంటన్ ఆడుతూ గుండె పోటుతో మృతి చెందాడు. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటు వస్తుంది.

తాజాగా అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ వైద్య విద్యార్థి గుండె పోటుతో మృతి చెందింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ పూజితా రెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి కెనడా వెళ్లింది. ఆమె గుండె పోటుతో మృతి చెందారు. 24 వయస్సులోనే ఆమెక్ గుండె పోటు రావడం ఆందోళన కలిగిస్తుంది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామం మల్కాపూర్ కు తీసుకొచ్చారు.

Medicine Student died with Heart Attack in USA, she belongs to Telangana

యువతీయువకులు గుండె పోటు వచ్చి చనిపోయడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో చాలా మంది ఛాతిలో ఏదైనా నొప్పి రాగానే భయపడి పోతున్నారు. అయితే ఛాతిలో నొప్పి వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా యుక్త వయస్సులో వచ్చే గుండె పోటు చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెబుతున్నారు.

చాలా మంది ఎక్కువగా జిమ్ చేస్తున్నారని.. ఏదైనా అతిగా చెయ్యొద్దని సూచిస్తున్నారు. మన తీసుకునే ఆహారం సరిగా జీర్ణమయ్యేలా చూసుకోవాలని సూచించారు. మెట్లు ఎక్కడం, వాకింగ్ చేయడం చేస్తే మంచిదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+