NRI News: అమెరికా, సింగపూర్‍లో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

తెలంగాణ సంప్రదాయం ఎల్లలు దాటింది. తెలంగాణలో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగను ఇప్పుడు తెలంగాణ వారు ఉన్నా జరుపుకుంటున్నారు. తాజాగా సింగపూర్ లో తెలంగాణ కల్చరల్‌ సొసైటీ సింగపూర్‌ ఆధ్వర్యంలో సింగపూర్‌ బతుకమ్మ2023 పండగను నిర్వహించనున్నారు. సంబవాంగ్ పార్క్‌లో ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహించేదుకు ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సింగపూర్‌లో తెలంగాణ వాళ్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ పేర్కొంది.

సింగపూర్‌లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారు కూడా బతుకమ్మ, బోనాలు జరుపుకోవడం ఎంతో అభినందనీయని సింగపూర్‌ కల్చరల్‌ సొసైటీ సభ్యులు తెలిపారు. తెలంగాణ సాంప్రదాయ పండగలను అందరితో కలిసి సెలబ్రేట్‌ చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అందంగా బతుకమ్మ పేర్చిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. అటు అమెరికాలో కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

People of Telangana are celebrating Bathukamma celebrations in America and Singapore

తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్ ఆఫ్‌ డాలస్‌ ఈ ఏడాది కూడా ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి డాలస్‌లోని ఆండ్రివ్‌ బ్రోన్ పార్క్‌ ఈస్ట్‌లో సందడి చేశారు. మహిళలందరూ బృందవలయాలుగా బతుకమ్మ ఆడారు. చిన్నబతుకమ్మ పండుగను సమర్థవంతంగా నిర్వహించినందకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అక్టోబర్‌ 15 ఆదివారం రోజున చిన్న బతుకమ్మ పండుగతో బతుకమ్మ-దసరా వేడుకలకు అంకురార్పణ చేసినట్లు తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్ ఆఫ్‌ డాలస్‌ తెలిపారు. అక్టోబర్‌ 22న సద్దుల బతుకమ్మ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏటా పదివేల మందితో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్‌ చేయనున్నట్లు వివరించింది. ఈ వేడుకలకు డాలస్‌లోని కొమెరికా సెంటర్‌ (పెప్పర్‌ ఎరెనా) వేదికగా నిలుస్తుందని.. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

సద్దుల బతుకమ్మకు సినీ కథానాయిక సంయుక్తామీనన్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. సుప్రసిద్ధ గాయకులు తమ గాత్రంతో వీనులవిందు చేయనున్నటలు నిర్వాహకులు పేర్కొన్నరాు. వేడుకల్లో భాగంగా రాఫెల్‌ ప్రైజ్‌లను అందజేస్తామని.. వీటిలో బీఎండబ్ల్యు బైక్‌, బంగారు నాణేలు, పట్టు చీరలు, డ్రెస్‌ మెటీరియల్‌, ఆర్టిఫిషియల్‌ జువెల్లరీతో పాటు గిఫ్ట్‌ ఓచర్లు ఉన్నాయని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+