కువైట్‌లో మహానాడు, అతిధిగా స్పీకర్ కోడెల

అమరావతి: ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సభాపతి, టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ కోడెల ప్రసాద రావు కువైట్‌లో తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో 29th May 2015 శుక్రవారం నిర్వహించిన మహానాడులో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ - కువైట్ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

కువైట్లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. సమస్యల గురించి భయపడాల్సిన పనిలేదని, తెదేపా హయాంలో కువైట్ ప్రవాసుల సంక్షేమం కోసం తామంతా ఉన్నామని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్ తో, చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని ఆయన సభికులతో పంచుకున్నారు.

కువైట్ లో కూడా ఇంత పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు హాజరుకావటం సంతోషంగా ఉందని కోడెల శివప్రసాద్ రావు అన్నారు. తెలుగుదేశం కువైట్ నిర్వహిస్తున్న మహానాడు‌లో సీఎం చంద్రబాబు పంపిన సందేశాన్ని సుధాకర రావు సభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారత రాయభారి శ్రీ సునిల్ జైన్ పాల్గొన్నారు.

Pravasandhra Mahanadu Grandly Celebrated In Kuwait

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు శ్రీమతి పర్ణిక, ప్రవీణ్ కుమార్ తో సంగీత విభావరి నిర్వహించింది. ఆహూతుల్ని ఈ సంగీత విభావరి అలరించింది. అంతక ముందు రోజు గురువారం ఆయన భారత రాయభారి శ్రీ సునిల్ జైన్ గారితో సమావేశమై కువైట్‌లో ఉన్న తెలుగు వారి సమస్యల పరిష్కారం గురించి చర్చలు జరిపారు.

అనంతరం ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించి తరువాత కేక్ కట్ చేసి ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమం కుదరవల్లి సుధాకర రావు, దరూరు బలరాం నాయుడు, వెంకటేష్ నాయుడు వేగి, శాంతారాం నాయుడు పోలినేని, ఖైతాన్ బాబు, పట్టాభి నాయుడు, గజేంద్ర, మల్లి, నాగేంద్ర, వెనిగళ్ల రాధామాధవ్, షేక్ బాషా, దుర్గా ప్రసాద్, మనోహర్, రామకృష్ణ, రవీంద్ర కాపెర్ల, పాలేటి కోటి, పార్ధసారధి, తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+