Virat Kohli: విరాట్ కోహ్లీ అన్ ఫాలో చేసిన సింగర్ ఇతనే.. ఎందుకంటే..!

పంజాబీ-కెనడియన్ శుభ్‌ నీత్ సింగ్ సింగర్ రాణిస్తున్నారు. అయితే అతను ఖలిస్తాన్, వేర్పాటువాదులకు మద్దతు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో అతని భారత పర్యటన రద్దు అయింది. శుభ్ భారతదేశంలోని అనేక నగరాల్లో ప్రదర్శన ఇవ్వాల్సింది. అయితే అతను "పంజాబ్ కోసం ప్రార్థించండి" అనే క్యాప్షన్‌తో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లేని భారతదేశం మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

శుభ్ నీత్ "స్టిల్ రోలిన్ టూర్"ని నిర్వహిస్తున్న BookMyShow, కచేరీలు రద్దు అయ్యాయని, టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బు చెల్లిస్తామని పేర్కొంది. "గాయకుడు శుభనీత్ సింగ్ స్టిల్ రోలిన్ టూర్ ఫర్ ఇండియా రద్దు చేయబడింది. ఆ దిశగా, షో కోసం టిక్కెట్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ బుక్‌మైషో టిక్కెట్ మొత్తాన్ని పూర్తిగా వాపసు చేయడం ప్రారంభించింది. రీఫండ్ 7-10 పని దినాలలో పూర్తి చేస్తాం" అని పేర్కొంది.

Renowned singer Shub Neet Singhs tour of India has been cancelled

పర్యటన కోసం టిక్కెట్లను విక్రయించినందుకు బుక్‌మైషో ఎక్స్‌పై అపవాదును ఎదుర్కొంటోంది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో #UninstallBookMyShow ట్రెండింగ్‌తో కీ వర్డ్ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తోన్నాయి. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో శుభ్‌ను అన్‌ఫాలో చేశాడు. భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. తమ దేశ గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాదిని హత్య చేయడంలో న్యూఢిల్లీ ప్రమేయం ఉందని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు.

ట్రూడో ఆరోపణలను "అసంబద్ధం" అని భారత్ అభివర్ణించడంతో ఇరు దేశాలు పరస్పరం సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించాయి. పంజాబ్‌కు చెందిన గాయకుడు, నటుడు రన్‌వీత్‌ సింగ్‌ సోదరుడైన 26 ఏళ్ల శుభ్‌నీత్‌ కొన్నేళ్ల క్రితం కెనడా వెళ్లి అక్కడే స్థిర నివాసం ఏర్పచుకున్నారు. అక్కడి నుంచే తన ర్యాప్‌ సింగింగ్‌ జర్నీని మొదలు పెట్టాడు. అతను 2021లో తన మొదటి బ్రేక్‌అవుట్ సింగిల్ 'వి రోలిన్'ని విడుదల చేశాడు.

2023 నాటికి, ఇది YouTubeలో 201 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అతను ఇటీవలే తన తొలి ఆల్బమ్ 'స్టిల్ రోలిన్'ని విడుదల చేశాడు. ఈ సంవత్సరం 10 విభిన్న నగరాల్లో అతను ప్రదర్శనలు ఇవ్వనున్నాడు. భారత పర్యటనకు BookMyShow స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+