ATA: ఇండియాకు ఆటా ప్రతినిధులు.. ఎందుకంటే..!
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆటా అధ్యక్షులు బొమ్మినేని మధు తెలిపారు. ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ పాశం కన్వీనర్ గా, కోఆర్డినేటర్ తిరుపతి శ్రీధర్, నేషనల్ కోఆర్డినేటర్ గా సుధిని సాయి, డైరెక్టర్ గా బొద్దిరెడ్డి అనీల్, కో కన్వీర్ గా అసిరెడ్డి ప్రశాంతి వ్యవహరించనున్నారు.
ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ 2024 జూన్ 7 నుంచి 9 వరకు అమెరికాలోని జార్జియా (Georgia) రాష్ట్రంలోని అట్లాంటా (Atlanta) మహానగరంలో నిర్వహించనున్నారు. మహాసభలకు అతిరధమహారథులకు ఆహ్వానం పలికేందుకు ఆటా నిర్వాహకులు ఇండియా వచ్చారు.
ఇందులో భాగంగా పరశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ , హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ప్రముఖ నటులు అజయ్ ఘోష్ తదితరులు నటించిన ది ఫ్యామిలీ స్టార్ తెలుగు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ప్రముఖ యాంకర్ సుమ ఆటా నాయకత్వాన్ని వేదిక మీదకు ఆహ్వానించారు.ఆటా కన్వెన్షన్ లో పాల్గొనవలసిందిగా ఆటా అధ్యక్షులు బొమ్మినేని మధు సభాముఖంగా కోరారు. అలాగే ది ఫ్యామిలీ స్టార్ యూనిట్ మొత్తానికి సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ కల్చరల్ ఇనాగరల్ కమిటీ ఛైర్ నీలిమ గడ్డమణుగు , కోడైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ, పొలిటికల్ ఛైర్ రమణ బత్తుల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ది ఫ్యామిలీ స్టార్ సినిమా టీంతో ఫోటోలు దిగారు.












Click it and Unblock the Notifications