అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గౌడ్స్ కాలనీకి చెందిన పంజాలనీరజ్ గౌడ్ (23) అనే యువకుడు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాద ఘటనలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన శ్రీధర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఏడాదిన్నర క్రితం వీరిద్దరూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి న్యూహెవెన్ సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 16న బ్రిడ్జిపోర్టు ప్రాంతానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా.. తీవ్రంగా మంచు కురుస్తుండటంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పోలీసు పెట్రోలింగ్ కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో గాయపడిన నీరజ్ గౌడ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మృతి చెందాడు. శ్రీధర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో ఐదు నిమిషాల్లో వీరు నివాసం ఉండే రూంకు చేరుకునే లూపే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు, పెట్రోలింగ్ పోలీసు కారులోని సిబ్బంది కూడా తీవ్రగాయాలయ్యాయి.
ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో బాగా స్థిరపడతారని భావిస్తున్న నీరజ్ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శ్రీధర్ కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన, ఆవేదనలో ఉన్నారు. ఈ ప్రమాద ఘటనతో ఇద్దరి కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.
నీరజ్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అతని బంధువులు తెలిపారు. కాగా, బోధన్‌కు చెందిన పంజాల నీరజ్ గౌడ్ తండ్రి శంకర్ గౌడ్ నెమ్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications