అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అనే యువకుడు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఓ యూనివర్సిటీలో ఎమ్మెస్ చేసేందుకు ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లాడు వంశీ.

ఆ దేశంలోనే చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి వంశీ ఉంటున్న అపార్ట్‌మెంట్ గ్రాండ్ ఫ్లోర్‌లో కారు సీట్లో విగత జీవిగా కనిపించాడు. గమనించిన తోటి విద్యార్థులు ఆదివారం వంశీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

Telangana student dies suspiciously in America

కన్న కొడుకు మరణవార్త విని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయాన్ని కమలాపూర్ మండల బీజేపీ నేత.. కేంద్రమంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, ఇటీవలే తెలంగాణకు చెందిన ఓ యువకుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గౌడ్స్ కాలనీకి చెందిన పంజాలనీరజ్ గౌడ్ (23) అనే యువకుడు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాద ఘటనలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన శ్రీధర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ప్రమాదంలో గాయపడిన నీరజ్ గౌడ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మృతి చెందాడు. శ్రీధర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో ఐదు నిమిషాల్లో వీరు నివాసం ఉండే రూంకు చేరుకునే లూపే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు, పెట్రోలింగ్ పోలీసు కారులోని సిబ్బంది కూడా తీవ్రగాయాలయ్యాయి.

ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో బాగా స్థిరపడతారని భావిస్తున్న నీరజ్ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శ్రీధర్ కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన, ఆవేదనలో ఉన్నారు. ఈ ప్రమాద ఘటనతో ఇద్దరి కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. నీరజ్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అతని బంధువులు తెలిపారు. కాగా, బోధన్‌కు చెందిన పంజాల నీరజ్ గౌడ్ తండ్రి శంకర్ గౌడ్ నెమ్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+