NRI News: వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ గా తెలుగు వ్యక్తి
మిచిగన్ రాష్ట్రానికి చెందిన తెలుగు వ్యక్తి సన్నీ రెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ గా గెలిచారు. మహామహులను వెనక్కి నెట్టిన రిపబ్లికన్ పార్టీ తరపున భారీ మెజారిటీతో విజయం సాధించారు. జనవరి 1, 2025 న మొదలైన సన్నీ టర్మ్ 8 సంవత్సరాల పాటు కొనసాగనుంది. పదవీ కాలం డిసెంబర్ 31, 2032 న ముగియనుంది. సన్నీ రెడ్డి గెలిచినట్లు మిచిగన్ రాష్ట్ర సీల్ తో సెక్రెటరీ ఆఫ్ స్టేట్ జోస్లీన్ బెన్సన్ అధికారిక ప్రకటన చేశారు. సన్నీ రెడ్డికి పత్రాలు కూడా అందించారు.
బ్లూమ్ ఫీల్డ్ హిల్స్ వాసి సన్నీ రెడ్డి జనవరి 16 తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. సన్నీ రెడ్డి గెలుపుపై ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు వారు సంబురాలు జరుపుకుంటున్నారు. అమెరికాలోని తెలుగు వారికే కాకుండా ఇండియన్ కమ్యూనిటీకే కాకుండా ఇండియాకు చెందిన అందరికి ఈ విజయం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. సన్నీ రెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. సన్నీ రెడ్డి కి అమెరికా తెలుగు సంఘంతో మంచి సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఆయన ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ట్రస్టీ గా కూడా ఆటా కి సేవలందిస్తున్నారు. 2017 లో హూస్టన్, 2021 లో కెంటకీ, 2024 లో ఫ్లోరిడా హరికేన్ల సమయంలో అమెరికన్ రెడ్ క్రాస్ తో కలిసి ఆయన పని చేశారు. మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా భారత సంతతికి చెందిన వారు విజయం సాధించారు. మొత్తం 9 మంది భారతీయ అమెరికన్లు పోటీ చేయగా.. ఆరుగురు విజయం సాధించారు. ఇందులో ప్రమీలా జయపాల్ రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, సుహాస్ సుబ్రమణ్యం, శ్రీథానేదార్, డాక్టర్ అమిబెరా ఉన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications