గుండెపోటుతో తెలుగు ఎన్నారై మృతి.. ఆపన్నహస్తం కోసం భార్య ఎదురుచూపు

Posted By:
Subscribe to Oneindia Telugu

మిన్నెసోటా: ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఎన్నో కలలు కన్నాడు. కుటుంబాన్ని ఉన్నత స్థితిలో నిలపాలని కోటి ఆశలు పెట్టుకున్నాడు. లక్ష్యానికి అనుగుణంగా చదువు, జీవితాన్ని కొనసాగించాలని అమెరికాలో అడుగుపెట్టాడు.

కానీ అతడి ఆశలు అడియాశలే అయ్యాయి. విధికి ఎదురునిలవలేక కన్నుమూశాడు. భార్య, కొడుకు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు శాశ్వతంగా దూరమయ్యాడు. తన లక్ష్యానికి శాశ్వత విరామం ప్రకటించాడు.

Telugu NRI died with Heart Attack in Minnesota, Wife Seeking Help

ఇది విజయవాడకు చెందిన, అమెరికాలో నివసిస్తున్న మాల్యాద్రి నల్లపనేని(33) కథ. భార్య శిరీషతో కలిసి మల్యాద్రి అమెరికాలోని మిన్నెసోటాలో నివాసముంటున్నాడు. వీరికి 15 నెలల వయసున్న ఓ కొడుకు ఉన్నాడు.

నవంబర్ 1న అర్థరాత్రి సమయంలో మాల్యాద్రికి గుండెపోటుకు వచ్చింది. గమనించిన భార్య శిరీష అతడిని హాస్పిటల్‌కు తరలించింది. అప్పటికే అతడు కోమాలోకి వెళ్లాడు. శరీరంలోని అవయవాల స్పందన ఆగిపోయింది.

కొద్ది రోజులపాటు వైద్యం చేసినా ఫలితం కానరాలేదు. ఇక ఎన్నిరోజులయినా అతడి ఆరోగ్యపరిస్థితిలో ఎటువంటి మెరుగుదల ఉండబోదని డాక్టర్లు వెల్లడించడంతో.. భర్త లైఫ్ సపోర్ట్‌ను తొలగించేందుకు శిరీష అంగీకరించింది. దీంతో మల్యాద్రి కన్నుమూశాడు.

Telugu NRI died with Heart Attack in Minnesota, Wife Seeking Help

ఈ పరిణామాలతో మల్యాద్రి కుటుంబం, అతడి భార్య శిరీష తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భర్త మృతదేహాన్ని స్వస్థలమైన విజయవాడకు తరలించడానికి కూడా సరిపడా డబ్బు లేకపోవడంతో వారి బాధ అంతా ఇంతా కాదు.

నిస్సహాయ స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని మల్యాద్రి భార్య శిరీష కోరుతోంది. దాతల ఆపన్న హస్తం కోసం.. తన 15నెలల కొడుకుతో కలిసి ఎదురుచూస్తోంది. దాతలెవరైనా 'గో ఫండ్ మీ డాట్ కాం' వెబ్ సైట్ ద్వారా సహాయం చేయవచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu NRI Malyadri Nallapanei(33) who is residing in Minnesota, USA recently suffered with heart attack. His wife Sireesha taken him to Hospital and admitted. There while taking treatment Malyadri died. He has 15 months Son also. His wife had no money to shift his body to Vijayawada. At present she is seeking help from others who can help her to shift the body from USA.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి