NRI News: లండన్ లో సంక్రాంతి వేడుకలు..
తెలుగువారు ఎక్కడున్నా తమ సంప్రదాయాలను పాటిస్తున్నారు. తెలుగు పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారు. తాజాగా జనవరి 25 శనివారం నాడు తూర్పు, పశ్చిమ లండన్ సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్రాంతి వేడుకలకు లండన్, పరిసర ప్రాంతాల నుంచి 1200 మందికి పైగా వచ్చారు. సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.
బొమ్మల కొలువు, భోగి పళ్లు, రంగోలి పోటీ, వంటల పోటీ, గాలిపటాల తయారీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తెలుగు వారంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. తూర్పు లండన్‌లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రెడ్‌బ్రిడ్జ్ కౌన్సిల్ మేయర్ కౌన్సిలర్ షీలా బెయిన్ హాజరయ్యారు.
వెస్ట్ లండన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్లవ్ మేయర్ కౌన్సిలర్ బల్విందర్ థిల్లాన్ వచ్చారు. యువత తమ సాంస్కృతిక మూలాలను
గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సంస్కృతిని యువతరానికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమా గీర్వాణి, హిమబిందు, మృదుల, హరిక, స్వాతి, సంగీత, ప్రశాంతి, వేద, స్వప్న, హరిణి, రజని, అనిత, సింధు, వాణి, షాజ్మా నేతృత్వంలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ మహిళా సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గిరిధర్, శ్రీధర్ ఎస్, రవి వి, రవి డి, బాలాజీ సి, లక్ష్మణ్, వెంకట్ నీల, అనిల్ అనంతుల, రాయ్ బొప్పనల నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభిన్న సాంప్రదాయ ప్రదర్శనలు, ఆకర్షణీయమైన పాటలు, నృత్య కార్యక్రమాలు, నోరూరించే వంటకాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.












Click it and Unblock the Notifications