Ata: ఆటా ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు..
ఉమెన్స్ డే సందర్భంగా ఆటా ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయనున్నారు. మహిళలు ప్రతి రంగంలో రాణించాలి అనే ఉద్దేశంతో 'ఇన్స్పిరే ఇంక్లూషన్ థీమ్' తో ఉమెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. మార్చి 9న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో యాక్సెంచర్ గ్లోబల్ ఎండీ రేవతి సుబ్రమణియన్, బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పాల్గొన్ననున్నారు. ఇందుకు సంబంధించి ఉమెన్స్ కమిటీ ఛైర్ పర్సన్ అంబటి ప్రవీణ ప్రకటన విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి మాధవి లత కూడా పాల్గొననున్నారు. ఇన్స్పిరే ఇంక్లూషన్ థీమ్ మార్చి 9 ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆటా ప్రెసిడెంట్ బొమ్మినేని మధు ఆటా కార్యవర్గం తరపున మహిళలకు అడ్వాన్స్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించాలని కోరుకున్నారు. ఆటా ఉమెన్స్ డే ఈవెంట్స్ అట్లాంటా, బోస్టన్, డల్లాస్, ఫీనిక్స్, వాషింగ్టన్ డీ.సి నగరాల్లో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నట్లు చెప్పారు.

అలాగే ఆటా(ATA) ఆధ్వర్యంలో 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. అధ్యక్షులు బొమ్మినేని మధు , కాన్ఫరెన్స్ కన్వీనర్ పాశం కిరణ్ నాయకత్వంలో జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆటా బ్యూటీ పాజంట్ 2024 అందాల పోటీలు ఏర్పాటు చేయనున్నారు. 12 సిటీల్లో టీన్, మిస్, మిస్సెస్, మిస్టర్ ఆటా బ్యూటీ పాజంట్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

18వ ఆటా కన్వెన్షన్ జార్జియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రముఖ జడ్జిల సమక్షంలో స్టార్ సెలెబ్రెటీస్ చేతుల మీదుగా ఫైనల్ విజేతలకు క్రౌన్ ప్రజంటేషన్ ఉండనుందని ప్రకటించారు. బ్యూటీ పాజంట్ పోటీలను అమెరికాలోని అట్లాంటా, ర్యాలీ, షార్లెట్, డల్లాస్, ఆస్టిన్, న్యూ జెర్సీ, లాస్ ఏంజలెస్, చికాగో, ఓర్లాండో, వాషింగ్టన్ డీసీ, నాష్విల్, డెట్రాయిట్ నగరాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. .ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్, ఫీజు, నిబంధనలు తదితర వివరాలకు www.NRI2NRI.com/ATA Beauty Pageant 2024 ని సందర్శించాలని నిర్వహకులు సూచించారు.












Click it and Unblock the Notifications