Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ..

ఉత్తర అమెరికాలో రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాల ప్రాచుర్యానికి కృషి చేస్తోంది డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్. ఈ క్రమంలోనే DFW ప్రాంతానికి చెందిన వాలీబాల్ ప్రేమికుల కోసం టోర్నమెంట్ నిర్వహించింది. 2025 మార్చి 30న టెక్సాస్ లోని ఫ్రిస్కో ఫ్లయర్స్ స్పోర్ట్స్ సెంటర్ లో ఈ పోటీలను చేపట్టారు. దాదాపు 30కు పైగా జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.

2025 DARA ప్రో, 2025 DARA అడ్వాన్స్ పేరిట నిర్వహించిన ఈ పోటీలు పూర్తయ్యి పలు జట్లు విజేతలుగా నిలిచారు. DARA ప్రో కప్ విజేతలుగా టీమ్ GPS నిలిస్తే.. రన్నర్స్ గా అవెంజర్స్ జట్టు స్థానం దక్కించుకుంది. అలానే DARA అడ్వాన్స్ కప్ విజేతలుగా డల్లాస్ కింగ్స్, రన్నర్స్ గా ఆల్ స్టార్స్ బ్లూ జట్టు నిలిచాయి. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న అన్ని జట్లకూ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ప్రతి ఆటగాడి క్రీడాస్ఫూర్తి ఈ టోర్నమెంట్‌ను మరపురానిదిగా మార్చిందని కొనియాడారు. విజయం సాధించిన జట్లకు హృదయపూర్వక అభినందనలు చెప్పారు.

volleyball-tournament-under-the-dallas-area-rayalaseema-association

ఇక ఈ పోటీలను విజయవంతంగా పూర్తి చేయడంలో DARA సలహా మండలి సభ్యులు కీలకపాత్ర పోషించారు. DARA ప్రెసిడెంట్ గౌతమ్ మియాపురం, గత అధ్యక్షుడు సునిల్ దేవిరెడ్డి, కాబోయే అధ్యక్షుడు వీర శివ రెడ్డి మండలి సభ్యులుగా వ్యవహరించారు. అలానే ఎగ్జిక్యూటివ్, స్టాండింగ్ కమిటీ ల సమిష్టి కృషి ద్వారా ఈ ఈవెంట్‌ను ఘన విజయం సాధించిందని అన్నారు. అంతే కాకుండా పోటీలకు స్పాన్సర్ లుగా ఉన్నవారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. తిరుమల రెడ్డి, ఉదయ్ నిడిగంటి, రాజ్ ఆవుల, లోకేష్ నాయుడు టోర్నెమెంట్ కి స్పాన్సర్ చేశారు.

డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్.. ఉత్తర అమెరికాలో రాయలసీమ సంస్కృతిని పరిరక్షిస్తూనే.. సమాజ సేవను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ కొనసాగుతోంది. అంతే కాకుండా రాయలసీమ వంటకాల ప్రాచుర్యాన్ని కొనసాగిస్తున్నారని.. DARA పలు ఇతర సంస్థలకు కూడా ప్రేరణగా నిలుస్తోందని వెల్లడించారు. యువత భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని గుర్తించిన DARA, భవిష్యత్ తరాన్ని పోషించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+