H1B Visaలపై కుండబద్దలు కొట్టిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump on H1B visa: అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని అందుకున్న ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే నాన్ అమెరికన్లకు జన్మించే పిల్లలకు ఆటోమేటిక్‌గా వర్తించే పౌరసత్వాన్ని రద్దు చేసి పడేశారు. వలసలు అధికంగా ఉండే మెక్సికో సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేస్తోన్నారు.
ఈ క్రమంలో హెచ్1బీ విసాలపై డొనాల్డ్ ట్రంప్ మున్ముందు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారనేది చర్చనీయాంశమౌతోంది. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో ఎక్కువ భాగం అమెరికన్లకే కల్పించాల్సి ఉందంటూ ఇదివరకే ప్రకటించారు ట్రంప్. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో అమెరికాకు వలస వెళ్లే వారికి ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పరిస్థితుల మధ్య హెచ్1బీ విసా ప్రోగ్రామ్‌పై డొనాల్డ్ ట్రంప్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అన్ని స్థాయిల్లో కూడా అత్యంత నిపుణులు, సమర్థులు అమెరికాకు రావడానికి తాను ఇష్టపడతానని తేల్చి చెప్పారు. స్కిల్డ్ వర్కర్లకు ఎలాంటి ఢోకా ఉండబోదనే సంకేతాలను పంపించారు.
వైట్‌హౌస్‌లో ఒరాకిల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ల్యారీ ఎల్లిసన్, సాఫ్ట్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మసయోషి సన్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ట్రంప్. అత్యంత సమర్థుల (Very Competent People)కు తమ దేశంలో చోటు ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాంటి వాళ్లు ఇక్కడికి రావడానికి ఇష్టపడతానని అన్నారు.
అన్ని అర్హతలు ఉన్నవాళ్లను అడ్డుకోవాలని తాను అనుకోవట్లేదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాను ఇంజినీర్ల గురించి మాత్రమే మాట్లాడట్లేదని, అన్ని రంగాలు, అన్ని స్థాయిల్లో ప్రతిభ ఉన్నవాళ్లు, సమర్థులు, అన్ని అర్హతలు ఉన్నవాళ్లు అమెరికాకు రావాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
హెచ్1బీ విసా ప్రోగ్రామ్ గురించి తనకు సమగ్ర అవగాహన ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ట్రంప్. బాగా తెలుసు. నేను ప్రోగ్రామ్‌ని ఉపయోగిస్తాను. ప్రతిభ ఉంటే- రెస్టారెంట్లు, హోటళ్లల్లో పని చేసే మైట్రే డి (హెడ్ వెయిటర్లు), వైన్ నిపుణులు, వెయిటర్లు కూడా అమెరికాకు రావొచ్చని పేర్కొన్నారు. ల్యారీ ఎల్లిసన్ (ఒరాకిల్ సీటీఓ) వంటి వాళ్లకు టాలెంట్ ఉన్న వాళ్లే అవసరమని చెప్పారు.












Click it and Unblock the Notifications