AdWorld Showdown 2023: ఆసక్తికరమైన షో

ముంబై: మార్కెటింగ్ సెగ్మెంట్‌లో ఓ ఆసక్తికరమైన ఈవెంట్ ఏర్పాటు కానుంది. గ్లోబల్ ట్రెండ్స్ ఫోరమ్‌- ఇంక్‌స్పెల్ సంయుక్తంగా నిర్వహించనున్న యాడ్ వరల్డ్ షోడౌన్ 2023 (Adworld Showdown 2023) కోసం చురుగ్గా సన్నాహకాలు సాగుతున్నాయి. మార్కెటింగ్ ప్రపంచంలో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసే ఈవెంట్‌ ఇది. ఈ ప్లాట్‌ఫారమ్ సృజనాత్మకత, ఆవిష్కరణలకు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ యాడ్ వరల్డ్ షోడౌన్ 2023 అనేది మార్కెటింగ్ ప్రోగ్రామ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ రంగంలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఉద్దేశించిన ఈవెంట్ ఇది. వారిలోని సృజనాత్మకతను ఆవిష్కరించడానికి ఇదొక వేదిక. మార్కెటింగ్‌లో అనుభవజ్ఞులైన నిపుణులు మొదలుకుని వర్ధమాన ప్రతిభావంతుల వరకు తమ ఆలోచనాశక్తిని, సృజనాత్మకతను ఇక్కడ ఆవిష్కరించుకోవచ్చు.

AdWorld Showdown 2023: Where Creativity and Innovation meets with Marketing Titans

ఫలితంగా మార్కెటింగ్ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందవచ్చు. ఈ ఈవెంట్ మార్కెటింగ్, బ్రాండింగ్, అడ్వర్టయిజ్‌మెంట్స్‌పై ఆసక్తి ఉన్నవారికి తిరుగులేని వేదికగా ఉపయోగపడుతుంది. బ్రాండింగ్, క్రియేటివిటీ, క్రియేటివ్ కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్.. వంటి కార్యక్రమాలను ప్రదర్శించడానికి ఇంక్‌స్పెల్ దీన్ని నిర్వహిస్తోంది.

అడ్వర్టైజింగ్ సెక్టార్‌లో వివిధ విభాగాల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన వారికి ప్రత్యేక పురస్కారాలు సైతం ఇవ్వనున్నారు నిర్వాహకులు. బెస్ట్ బ్రాండ్ ఎక్స్‌పీరియన్స్, బ్రాండింగ్, బ్రాండ్ అడ్వర్టైజింగ్, వాటిని జనంలోకి తీసుకెళ్లడానికి అనుసరించే మార్కెటింగ్ స్ట్రాటజీ, ప్రొడక్టివిటీ, ప్రొడక్ట్ డిజైన్, పబ్లిక్ రిలేషన్, మీడియా ప్లానింగ్, ట్రెడీషినల్, డిజిటల్ కేటగిరీల కింద బ్రాండ్ ఐడెంటిటీ విభాగంలో అవార్డులు ఇస్తారు.

యాడ్ వరల్డ్ షోడౌన్ 2023 ఈవెంట్.. వర్ధమాన మార్కెటింగ్ నిపుణులు, ఔత్సాహికులకు ఓ మంచి దిశానిర్దేశం చేయగలుగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇందులో పాల్గొన దలిచినవారు- మార్కెటింగ్ ఇండస్ట్రీ పోకడలు ఎలా ఉన్నాయనే విషయాన్ని సైతం తెలుసుకోవచ్చు. దీనిపై ఓ అవగాహనకు రావచ్చు.

మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి.. యాడ్, మార్కెటింగ్ సెగ్మెంట్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి ఇదొక ప్లాట్‌ఫామ్‌గా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. తమ సృజనాత్మకతకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించడం వల్ల ఈ రంగంపై పట్టు సాధించవచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+