Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియా కంటెంట్ లీడర్షిప్ అవార్డ్స్ 2023: కంటెంట్‌లో కింగ్స్‌ అనిపించే వారికి..!

ఎంతో ఆతురతతో ఎదురు చూసిన కంటెంట్ లీడర్షిప్ అవార్డులు-2023 ఎట్టకేలకు ప్రకటించారు.ఒక కంటెంట్‌ను సక్సెస్ చేయడం వెనక ఉన్న డేటా మరియు అనలిటిక్స్ విభాగంలో ప్రతిభ కనబర్చిన వ్యక్తికి లేదా టీమ్స్‌కు ఈ అవార్డుల ద్వారా గౌరవించి గుర్తిస్తారు.వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ రంగంలో, వ్యూహాత్మకమైన మార్కెటింగ్ కోసం కంటెంట్ అనేది చాలా కీలకంగా మారింది.ఒక కంటెంట్ నిజంగా సక్సెస్ అయ్యిందంటే అందుకు కారణం డేటా అని చెప్పాలి. అవును కంటెంట్‌ ఎంచుకునే ముందు డేటాను స్టడీ చేసి ఆ కంటెంట్ ఎంతమేరకు ప్రజలకు చేరుతుందనేది అంచనా వేయగలగాలి.

విలువైన ఇన్‌సైట్స్ కోసం ఎవరైతే డేటా సేకరిస్తారో, సేకరించిన డేటాను ఎలా వినియోగించుకుని ఫలితాలను రాబడుతారో అలాంటి వారికి గుర్తింపును ఇవ్వడం కోసం ఇండియా కంటెంట్ లీడర్షిప్ అవార్డులు 2023ని ప్రకటించారు. సేకరించిన సమాచారం ద్వారా మంచి కంటెంట్ క్రియేట్ చేసి విభిన్న రంగాల్లో బిజినెస్ వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి.

Celebrating The Power of Insights: India Content Leadership Awards 2023

వ్యూహాత్మకమైన కంటెంట్ క్రియేట్ చేయడంలో కంటెంట్ అనలిటిక్స్ కీలకపాత్ర పోషిస్తాయని గుర్తించేందుకుగాను ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. యూజర్ బిహేవియర్‌ను విశ్లేషించి ఏమేరకు కంటెంట్ అవసరమవుతోందో అంతవరకే అంచనా వేయగల సామర్థ్యం ఉన్నవారిని ఎంపిక చేసి విజేతలుగా ప్రకటించి వారికి ఈ అవార్డులను అందజేయడం జరుగుతోంది.విభిన్న రంగాల్లో కంటెంట్‌ను వీరంతా మరో లెవెల్‌కు తీసుకెళ్లారు.

ఇండియా కంటెంట్ లీడర్షిప్ అవార్డులు 2023ని పలు కేటగిరీల్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ కేటగిరీలను ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు పలు విభిన్న రంగాలకు చెందిన కంటెంట్‌తో ప్రావీణ్యులుగా నిలిచారు.డేటా ద్వారా కంటెంట్‌ను అంచనా వేయడం దగ్గర నుంచి ప్రస్తుత ట్రెండ్స్‌ను గుర్తించడం వరకు వీరంతా పట్టు సాధించారు.

ఇక విజేతలను ఆషా మాషీగా ఎంపిక చేయలేదు. వీరిని సెలెక్ట్ చేసేందుకు గాను ఇండస్ట్రీ నిపుణులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.ఎంపికలో పారదర్శకత ఉండేలా చూశారు.ఇక అనలిటిక్స్‌లోని మెథడాలజీలు ఎలా ఉన్నాయి, వ్యూహాత్మకమైన కంటెంట్‌పై వీరిచ్చే ఇన్‌సైట్స్ ఎలా ఉపయోగపడ్డాయి తద్వారా బిజినెస్ ఈ మేరకు వృద్ధి చెందిదనే అంశాలపై న్యాయనిర్ణేతలు విజేతలను ప్రకటించారు.

అవార్డుల కార్యక్రమం విషయానికొస్తే పలువురు ప్రముఖుల ప్రసంగాలతో పాటు, ప్యానెల్‌లో ఉన్నావారితో చర్చ, ఇండస్ట్రీలోని ప్రముఖులతో ముఖాముఖిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు ఇండస్ట్రీపై పట్టు సాధించుకునేందుకు చాలా నేర్చుకోవచ్చు. కంటెంట్ మార్కెటింగ్ రంగాన్నే తమదైన మెలుకువలతో మరో లెవెల్‌కు తీసుకెళ్లొచ్చు.

కంటెంట్ లీడర్షిప్ అవార్డులు 2023ని ప్రకటించడంలో సంతోషంగా ఉందన్నారు ఇంక్‌స్పెల్ మీడియా సీఓఓ విపుల్ తివారీ.కేవలం అత్యద్భుత ప్రదర్శన లేదా ప్రతిభ కనబర్చిన వారికి గుర్తింపును ఇవ్వడమే కాకుండా చాలామంది తమ ఆలోచనలను పంచుకునేందుకు కూడా ఒక మంచి వేదికగా నిలుస్తుందని విపుల్ తివారీ అన్నారు. కంటెంట్ లీడర్లు, అనలిటిక్స్ ప్రొఫెషనల్స్, మార్కెటింగ్ స్ట్రాటెజిస్టులు, ఇండస్ట్రీపై ఆసక్తి ఉన్నవారంతా కంటెంట్ లీడర్షిప్ అవార్డుల కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఇండియా కంటెంట్ లీడర్షిప్ అవార్డులు, ఈవెంట్ అప్‌డేట్స్ కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి. https://www.indiacontentleadership.com

సోషల్ స్టార్ అవార్డులు 2023:

సోషల్ మీడియాపై చిట్టిపొట్టి కథలు చెప్పడంలో ప్రావీణ్యత సంపాదించిన వారికి సోషల్ స్టార్స్ అవార్డ్స్ 2023 ఇవ్వనున్నారు. డిజిటల్ రంగంలో కథలు కానీ ఇతరత్రా మంచి విషయాలను షేర్ చేసుకునేవారిని గుర్తించి వారికి ఈ అవార్డులతో గౌరవించడం జరుగుతుంది.

వేగంగా పరుగులు తీస్తున్న ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రపంచాన్నే ప్రభావితం చేసే ఆయుధంగా మారుతోంది.యూజర్లను ప్రభావితం చేయడంలో చెరగని ముద్ర వేస్తోంది. తమ కథల ద్వారా ప్రజలను ప్రభావితం చేయడం, ఎక్కువగా ఎంగేజ్‌ చేయడం, వ్యవస్థలో మార్పులు తీసుకురావడం వారిని గుర్తించి సోషల్ స్టార్స్ అవార్డ్స్ 2023తో గౌరవించడం జరుగుతోంది.

ఒక మంచి కథ ద్వారా మనుషులను ఒక్కటిగా చేయడం, వారిలో సృజనాత్మకతను పెంపొందించడం బ్రాండ్ పై విశ్వాసాన్ని పెంచడం చివరిగా డిజిటల్ రంగంలో చెరగని ముద్రవేసిన వారిని గుర్తించి సోషల్ స్టార్స్ అవార్డ్స్ ఇస్తున్నారు.మార్కెంటింగ్ ప్రొఫెషనల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక ప్యానెల్‌గా ఏర్పడి విజేతలను నిర్ణయిస్తారు. కంటెస్టెంట్ ఏ విధంగా తన కథను బలంగా తీసుకెళుతున్నారు,ఆడియెన్స్ నుంచి వచ్చే స్పందన, కంటెంట్ యొక్క ప్రభావం, అదే సమయంలో తన కథను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏ మేరకు సోషల్ మీడియా వేదికను వినియోగించుకుంటున్నారనే అంశాలపై వీరిని నిర్ణయించి విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది.

నామినేట్ అయిన వారికి సోషల్ స్టార్స్ అవార్డులకు నామినేట్ అయిన వారికి గుర్తింపు రావడంతో పాటు, ఇతరులకు స్ఫూర్తినిచ్చే కథలు వినిపించే అవకాశం లభిస్తుంది.అంతేకాదు వారికున్న ఆలోచనలను, సృజనాత్మకతను షేర్ చేసేందుకు ఇదొక చక్కటి వేదికగా నిలుస్తుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు మంచి ప్రసంగాలు, వర్క్‌షాప్‌లు, ఇండస్ట్రీ ప్రముఖులను కలిసే అవకాశం దక్కుతుంది.

ఈ రెండు కార్యక్రమాలను గ్లోబల్ ట్రెండ్స్ ఫోరం, ఇండియా క్రియేటివ్ ఇండస్ట్రీస్ కౌన్సిల్, జోష్ యాప్, వన్ ఇండియా, కెన్సియో,ప్రెస్ రిలీజ్ డాట్ కామ్, ఈడీ టైమ్స్, ది ప్రివెలెంట్ ఇండియా & 24 ఫ్రేమ్స్ డిజిటల్ సంస్థలు కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.

మరిన్ని వివరాలకు నామినేట్ అయిన వారి కోసం సందర్శించండి : https://thesocialstars.in

ఎంట్రీలు & రిజిస్ట్రేషన్ల కోసం :

గీతికా కౌశల్ | +91 7863851515 | [email protected]

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+