Bajaj Insta Personal Loan:మీ అత్యవసర ఖర్చులకు ఇన్స్టా పర్సనల్ లోన్ ..!
జీవితం అనూహ్యమైనది. ఒక నిమిషం మృదువుగా సాగిపోతుంది, మరుక్షణమే అనుకోని ఖర్చు మీ బడ్జెట్ ను అస్తవ్యస్తం చేయవచ్చు. కారు ఇబ్బందులు, కారుతున్న పైకప్పు, లేదా అకస్మాత్ వైద్య బిల్లు - ఈ అత్యవసరాలకు ఒక పరిష్కారం కొరకై మీరు పెనుగులాడుతూ ఉండవచ్చు.
ఇక్కడే ఇన్స్టా పర్సనల్ లోన్ అడుగుపెడుతుంది, ఇది అనుకోని ఆర్ధిక ఇబ్బందులను నిర్వహించుకొనేందుకు ఒక త్వరిత మరియు సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. తక్కువ ఒత్తిడి మరియు అత్యధిక సౌకర్యముతో ఈ ఊహించని పరిస్థితులను ఎదుర్కొనడములో మీకు సహాయపడేందుకు బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టా పర్సనల్ లోన్ రూపొందించబడింది.

అత్యవసరాలకు ఇన్స్టెంట్ లోన్స్ ఒక గొప్ప ఎంపికగా చేసే 5 ఫీచర్స్
1.త్వరిత పంపిణి: ఇన్స్టా పర్సనల్ లోన్స్ వాటి వేగవంతమైన ప్రక్రియకు పేరుగాంచాయి. ముందుగా-ఆమోదించబడిన ఆఫర్లు మరియు సులభమైన దరఖాస్తు ప్రక్రియతో, అతితక్కువగా 30 నిమిషాల* నుండి 4 గంటలలోపు ఋణ మొత్తము మీ ఖాతాలో క్రెడిట్ అవుతుంది.
2.కొల్లాటరల్ అవసరం లేదు: తరచూ కొల్లాటరల్ అవసరమయ్యే సంప్రదాయిక ఋణాల మాదిరిగా కాకుండా ఇన్స్టా పర్సనల్ లోన్స్ అసురక్షితమైనవి. అంటే ఈ ఋణము తీసుకొనుటకు మీరు ఎలాంటి ఆస్తులు తనఖా పెట్టవలసిన పనిలేదు.
3.అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితి: ఈ ఋణాలు అనువైన తిరిగిచెల్లింపు ఎంపికలను అందిస్తాయి, తద్వారా మీరు మీ ఆర్ధిక పరిస్థితికి తగిన కాలపరిమితిని ఎంచుకోవచ్చు. మీరు మీ ఈఎంఐలను సౌకర్యవంతంగా నిర్వహించుకోవచ్చని ఇది నిర్ధారిస్తుంది. కాలపరిమితి, ఋణ మొత్తము మరియు వడ్డీ రేటును ఎంటర్ చేయడం ద్వారా మీ నెలవారి వాయిదాలను అంచనావేయుటకు ఇన్స్టా పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించండి.
4.ముందుగా-ఆమోదించబడిన ఆఫర్లు: కేవలం మీ మొబైల్ నంబరు మరియు ఓటిపితో మీ ముందుగా-ఆమోదించబడిన ఆవర్ ను మీరు పరీక్షించుకోవచ్చు.
5.పేపర్ వర్క్ లేదు: ఎంపికచేయబడిన వినియోగదారులు ఎలాంటి దస్తావేజులు సబ్మిట్ చేయవలసిన పనిలేకుండా ఇన్స్టా పర్సనల్ లోన్ పొందవచ్చు.
సబ్మిట్ చేసిన తరువాత, తదుపరి ప్రక్రియలో మీకు సహాయం చేయటానికి ఒక ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
ఇన్స్టా పర్సనల్ లోన్ తో అనేక ఖర్చులను నిర్వహించుకోండి
వైద్య అత్యవసరాలు: వైద్య అత్యవసరాల కారణంగా ఆర్ధికంగా చితికిపోవచ్చు. ఇన్స్టా పర్సనల్ లోన్స్ ఆసుపత్రి బిల్లు, శస్త్రచికిత్స ఖర్చులు, మరియు చికిత్సానంతర సంరక్షణలను కవర్ చేయడానికి తక్షణ నిధులు అందిస్తాయి. ఎలాంటి ఆర్ధిక ఒత్తిడి లేకుండా మీకు లేదా మీ ప్రియమైన వారికి సమయానికి తగిన వైద్య సంరక్షణ అందుతుందని ఇది నిర్ధారిస్తుంది.
ఇంటి మరమ్మత్తులు: కారుతున్న పైకప్పును బాగుచేయడము లేదా విరిగిన గృహోపకరణాన్ని మార్చడము వంటి అనుకోని ఇంటి మరమ్మత్తులు ఖర్చుతో కూడుకున్నవి కావచ్చు. ఇన్స్టా పర్సనల్ లోన్ తో, మీరు ఈ సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చు మరియు మీ ఇంటి యొక్క భద్రత మరియు సౌకర్యాన్ని నిలిపి ఉంచవచ్చు.
వివాహ ఖర్చులు: చివరి-నిమిషం విక్రేత చెల్లింపుల నుండి అదనపు అతిధుల కొరకు ఏర్పాట్ల వరకు వివాహాలలో తరచూ ఊహించని ఖర్చులు ఉంటాయి. ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ ఈ ఖాళీని పూరించడములో సహాయపడవచ్చు మరియు మీ ప్రత్యేకమైన రోజు ఎలాంటి ఆర్ధిక ఆందోళనలు లేకుండా మృదువుగా జరుగుతుందని నిర్ధారిస్తుంది.
ప్రయాణ ఖర్చులు: అత్యవసర ప్రయాణము, అది కుటుంబములో అత్యవసర పరిస్థితి కావచ్చు లేదా అనుకోని అవకాశం కావచ్చు, ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ ఫ్లైట్స్, వసతి మరియు ఇతర ప్రయాణ-సంబంధ ఖర్చుల కోసం నిధులను అందిస్తుంది. ఇది మీరు తక్షణ ఆర్ధిక ఆందోళనల భారం లేకుండా మీ ట్రిప్ పై దృష్టి పెట్టడానికి అవకాశం ఇస్తుంది.
ఒక ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ కొరకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవడం చాలా సుళువైనది. ఈ దిగువన దశలవారి గైడ్ ఇవ్వబడింది:
1.యాప్ డౌన్లోడ్ చేసుకోండి: గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి బజాజ్ ఫిన్ సర్వ్ యాప్ ను ఇన్స్టాల్ చేయండి.
2.రిజిస్టర్ చేయండి లేదా లాగిన్ చేయండి: ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయండి లేదా మీ ప్రస్తుత ప్రమాణాలతో లాగిన్ చేయండి.
3.పర్సనల్ లోన్ విభాగాన్ని యాక్సెస్ చేయండియాప్ ఇంటర్ఫేస్ లో పర్సనల్ లోన్ విభాగాన్ని కనుగొనండి.
4.ఋణము మొత్తము మరియు కాలపరిమితిని ఎంచుకోండి.మీ అర్హతను ధృవీకరించిన తరువాత, మీ ఆవశ్యకతలకు తగినట్లుగా ఋణ మొత్తము మరియు తిరిగి చెల్లింపు కాలాన్ని ఎంచుకోవడములో క్విక్ లోన్ యాప్ మీకు గైడ్ చేస్తుంది. మీ ఈఎంఐ మొతాన్ని నిర్ణయించుకొనుటకు మరియు అది మీ తిరిగిచెల్లింపు బడ్జెట్ కు అనుకూలంగా ఉంటుందా అని అంచనా వేయుటకు ఇన్స్టా పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించండి
5.దరఖాస్తు సబ్మిట్ చేయండి: కావలసిన వివరాలను నింపండి మరియు మీ దరఖాస్తును సబ్మిట్ చేయండి.
ముగింపు
ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ అనేక అత్యవసర ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించుటలో మీకు సహాయపడే ఒక బహుముఖ ఆర్ధిక సాధనము. దీని త్వరిత దరఖాస్తు ప్రక్రియ, అనువైన తిరిగి చెల్లింపు ఎంపికలు మరియు ముందుగా-ఆమోదించబడిన ఆఫర్స్ తో, ఇది మీకు నిధులు తక్షణం కావలసినప్పుడు ఒక విశ్వసనీయమైన పరిష్కారాన్ని అందిస్తుంది. దీని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి మరియు ఈ ఋణాలను ఎలా వినియోగించుకోవాలని అర్థంచేసుకోవడం ద్వారా, మీరు మీకు ఎదురయ్యే అనుకోని ఆర్ధిక సవాళ్ళకు సిద్ధంగా ఉండవచ్చు. అది ఒక వైద్య విపతు అయినా, ఇంటి మరమ్మత్తు, వివాహము, లేదా అత్యవసర ప్రయాణము అయినా, జీవితములో అత్యవసర పరిస్థితులను నమ్మకముతో అధిగమించుటకు ఒక ఇన్స్టా పర్సనల్ లోన్ మీకు ఆర్ధిక సహకారాన్ని అందిస్తుంది.
*నియమ నిబంధనలు వర్తిస్తాయి












Click it and Unblock the Notifications