డైలీ హంట్‌కు చెందిన పాపులర్ యాప్ జోష్ (Josh)కంటెంట్ క్రియేషన్‌లో అతితక్కువ కాలంలోనే ప్రాచుర్యం పొందింది. ఒక్క క్లిక్ చేస్తే చాలు యూజర్‌కు కావాల్సినంత ఎంటర్‌టెయిన్‌మెంట్, వైరల్ వీడియోస్, సరికొత్త కంటెంట్‌తో బహు భాషల్లో లభిస్తాయి. అంతేకాదు మీ సొంత టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా కూడా ఈ దేశీ యాప్ జోష్ ఉపయోగపడుతోంది. ఇక మీలో ఉన్న టాలెంట్‌ను వీడియో రూపంలో అప్‌లోడ్ చేసి నెక్ట్స్ లెవెల్ సెన్సేషన్‌గా మారేందుకు జోష్ యాప్ చక్కటి అవకాశం కల్పిస్తోంది. కంటెంట్ క్రియేషన్‌లో జోష్ అగ్రస్థానంలో దూసుకెళుతోంది. యూజర్లకు కావాల్సిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టెయిన్‌మెంట్ యాప్‌గా రికార్డు సృష్టిస్తోంది.
ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియా యుగం. ఈ సోషల్ మీడియా యుగంలో మీ సొంత ఆలోచనలతో, క్రియేటివిటీతో దూసుకెళ్లేందుకు జోష్ చక్కటి వేదికగా మారింది. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మిమ్మలను మీరుగా ప్రపంచానికి పరిచయం చేసుకునేలా జోష్ ప్రోత్సహిస్తోంది. మీ జీవితాన్ని అందంగా తీర్చి దిద్దుకునేందుకు అనుక్షణం ఫిల్టర్లు వేయడం మంచిది కాదని జోష్ నమ్ముతుంది. మీ జ్ఞాపకాలను ఎలాంటి ఫిల్టర్లు లేకుండా యథాతథంగా ఉంటేనే బాగుంటుంది. మీరు మీరుగా ఉంటేనే ఆ జ్ఞాపకాలను ఆస్వాదించగలుగుతారు.

మీరు మీరుగా ప్రపంచానికి పరిచయం అయ్యేందుకు జోష్ చక్కటి కాన్సెప్ట్‌తో వస్తోంది. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు జోష్ అతిపెద్ద క్యాంపెయినింగ్ నిర్వహిస్తోంది. దీని పేరు #RealHai. సాధారణంగా ఏదైనా చేస్తే పర్ఫెక్ట్‌గా చేయాలనే ప్రయత్నం చేస్తాం. ఇందుకోసం టెక్నాలజీలోని టిప్స్ అన్ని వినియోగిస్తుంటాం. పైన చెప్పిన విధంగా మిమ్మలను మీరు ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ప్రపంచానికి పరిచయం చేసేలా జోష్ ప్రోత్సహిస్తోంది. మీలో ఉన్న అసలైన దేశీ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయండి. ఇక ఫిల్టర్లకు, ఎఫెక్ట్స్‌కు గుడ్ బై చెప్పేసి వాస్తవికతకు దగ్గరవ్వండి. మీరు మీరుగా ఉండండి.
Josh Community Creator Meghana Sunil Is A Talent To Watch Out For!
ఇక ఈ బృహత్తరమైన క్యాంపెయినింగ్‌లో భాగంగా, బాలీవుడ్ అందగాడు సిద్ధార్థ్ మల్హోత్రాను మరియు అందాల ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీలను జోష్ భాగస్వామ్యులుగా చేసింది. మీరేదైనా అవ్వాలంటే ముందుగా వాస్తవికతతో ఉండండి అంటూ పేర్కొనే మ్యూజికల్ వీడియోను వీరిద్దరి కలయికలో జోష్ తీసుకొస్తోంది. ఉత్తర భారతంలో సిద్ధార్థ్ మల్హోత్రా దక్షిణ భారతంలో హన్సికా మోత్వానీలు ఈ క్యాంపెయిన్‌ను రన్ చేస్తారు. ఇక ఈ మ్యూజిక్ వీడియోను కంపోజ్ చేశారు ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకులు సాజిద్-వాజిద్. మే 4వ తేదీన ఈ మ్యూజిక్ వీడియోను లాంచ్ చేశారు.
ఈ క్యాంపెయిన్‌ను మరింత విస్తృతం చేసేందుకుగాను జోష్ టాప్ ఇన్‌ఫ్లుయెన్జర్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తారు.అక్కడ స్థానికంగా ఉన్న క్రియేటర్లతో జతకట్టి మరింత లోకల్ కంటెంట్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.ప్రతి వారం ఆరు టాస్కులు ఇవ్వడం జరుగుతుంది. వివిధ రకాల జర్నర్లలో ఈ కంటెంట్ ఉంటుంది. ఇందులో డ్యాన్స్, ఫుడ్, ఫ్యాషన్, ఫిట్‌నెస్, ఎంటర్‌టెయిన్‌మెంట్‌లు ఉంటాయి. కామెడీ మరియు రీట్రో టైప్ కంటెంట్ ఇవ్వొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం... మీలో కూడా ఓ క్రియేటర్ దాగున్నట్లయితే వెంటనే మీ టాలెంట్‌ను జోష్ యాప్ పై ప్రదర్శించండి. ఈ సవాల్‌ను స్వీకరించి మీలో దాగి ఉన్న టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయండి అదే సమయంలో మంచి బహుమతులను కూడా గెలుచుకోండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చేసిన వీడియోలను #RealHai ట్యాగ్‌తో అప్‌లోడ్ చేయండి. వీలైనన్ని ఎక్కువ వీడియోలను చేసి అబుదాబిలో త్వరలో జరగబోయే ఐఫా అవార్డులను ప్రత్యక్షంగా చూసేందుకు గోల్డెన్ టికెట్‌ను సొంతం చేసుకోండి.అంతేకాదు ఐపీఎల్ 2022 ఫైనల్స్‌ను ప్రత్యక్షంగా చూసే గొప్ప అవకాశం కూడా మీదే కావొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందికదూ..!!
RECOMMENDED STORIES