అత్తాపూర్‌లో ఆర్ఎస్ బ్రదర్స్
కుటుంబ సమేతంగా షాపింగ్ చేయదగిన అత్యంత విశ్వసనీయ పేర్లల్లో ఒకటైన ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం.. హైదరాబాద్ అత్తాపూర్‌లో 13వ షోరూమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. వర్తక, వాణిజ్యరంగాల్లో సుదూర దృష్టి గల పీ వెంకటేశ్వర్లు, ఎస్ రాజమౌళి, టీ ప్రసాదరావు, దివంగత పీ సత్యనారాయణ సంయుక్తంగా ఆర్ఎస్ బ్రదర్స్‌ను స్థాపించారు.
సంప్రదాయాన్ని ఆధునిక ఫ్యాషన్‌తో మిళితం చేస్తూ అనేక సంవత్సరాలుగా బ్రాండ్ నిలుపుతున్నారు. హైదరాబాద్‌వాసులకు అసాధారణమైన షాపింగ్ అనుభవాన్ని అందించే ఆర్ఎస్ బ్రదర్స్ బరాండ్ ప్రయాణంలో తాజాగా మరో మైలురాయిని అందుకున్నారు. అత్తాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను ప్రముఖ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యాషన్‌లో విశ్వసనీయతను కలిగి, అత్యుత్తమ ధరలకు వైవిధ్యభరితమైన వస్త్రాలను కొనుగోలుదారులకు అందజేస్తోందని అన్నారు. ఈ సంస్థ యాజమాన్యం మున్మందు మరిన్ని విజయాలను అందుకోవాలని కోరకుంటున్నట్లు చెప్పారు. వివాహ వేడుకలు, రంజాన్ కలెక్షన్లపై ఆకర్షణీయమైన ప్రారంభ ఆఫర్లను కోల్పోవద్దని కోరారు.
ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు పీ వెంకటేశ్వర్లు, ఎస్ రాజమౌళి, టీ ప్రసాదరావు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ షాపింగ్ మాల్‌గా తమ బ్రాండ్‌ను నిలపాలన్నదే తమ ధ్యేయంగా ప్రకటించారు. సంస్థ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు.

వినియోగదారులకు ఉన్నత స్థాయి సేవలను అందించడంలో ఆర్ఎస్ బ్రదర్స్ ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుందని తెలిపారు. అత్తాపూర్‌లో 13వ షోరూమ్‌ను స్థాపించడం ద్వారా కస్టమర్లకు మరింత ఉత్తమమైన వస్త్ర ఎంపికలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వారు పేర్కొన్నారు.
అత్తాపూర్ షోరూమ్‌లో పురుషులు, మహిళలు, పిల్లల దుస్తుల్లో నాలుగు లక్షలకు పైగా విస్తృతమైన కలెక్షన్లను అందజేస్తోంది ఆర్ఎస్ బ్రదర్స్. ధరలు 150 రూపాయల నుండి ప్రారంభమౌతాయి. అంతర్జాతీయ ఫ్యాషన్లును తక్కువ ధరలకు అందించే ఈ షోరూమ్‌లో కంచి పట్టుచీరెలు, ఫ్యాన్సీ చీరెలు, డ్రెస్ మెటీరియల్, వెస్ట్రన్ దుస్తులు, బ్రాండెడ్ దుస్తులు, ఎథ్నిక్, సంప్రదాయ దుస్తులు లభిస్తాయి.

ఈ సందర్భంగా డైరెక్టర్ పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రేష్టమైన కంచి పట్టుచీరెలు, అద్భుతమైన వివాహ కలెక్షన్లను బెస్ట్ ప్రైస్‌కు అందిస్తోన్నామని అన్నారు. రాబోయే వివాహ సీజన్ కోసం ప్రీమియం బ్రైడల్ వేర్, డిజైనర్ అసెంబుల్స్, ఎథ్నిక్ వేర్‌ను అందించడంలో ఆర్ఎస్ బ్రదర్స్ నిబద్ధతను చాటిచెప్పారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన హై-ఫ్యాన్సీ చీరెల కలెక్షన్లు, అలాగే అందరి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా పురుషుల దుస్తుల బ్రాండ్లను రూపొందించామని డైరెక్టర్ ఎస్ రాజమౌళి తెలిపారు. రంజాన్ సీజన్ కోసం పండుగ దుస్తులు, ఫ్యూషన్ ఫ్యాషన్, సంప్రదాయ, ఎథ్నిక్ దుస్తుల్లో కొత్త మోడళ్లను పరిచయం చేస్తోన్నామని అన్నారు.

డైరెక్టర్ టీ ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో జరిగే వేడుకలకు ఆర్ఎస్ బ్రదర్స్ ఇష్టమైన బ్రాండ్‌గా మార్చిన తమ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాణ్యత, వైవిధ్యం, విలువలను నిరంతరం అందించడం ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టడానికి అంకితభావంతో ఆర్ఎస్ బ్రదర్స్ ఉందని పేర్కొన్నారు.
Download











Click it and Unblock the Notifications