రిటైల్ రంగంలో ట్రెండ్ సృష్టిస్తోన్న అపర్ణ కన్‌స్ట్రక్షన్స్

తమ వ్యాపార విభాగాలను విస్తరిస్తోన్న అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ , రిటైల్ మరియు వినోద రంగాలలో ప్రవేశం కోసం రూ. 284 కోట్లు పెట్టుబడి పెట్టింది. రిటైల్ రంగంలో విస్తరణ కోసం రూ. 252 కోట్లు పెట్టుబడి, తమ మొదటి మాల్ అపర్ణ నియోను ప్రారంభించింది. వినోద విభాగంలోకి ప్రవేశించడానికి రూ. 32 కోట్లు పెట్టుబడి , అపర్ణ సినిమాస్ ను ప్రారంభించింది. హైదరాబాద్, 27 మే, 2024: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ అభివృద్ధి సంస్థ , అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్‌లో అపర్ణ నియో మాల్ మరియు అపర్ణ సినిమాస్‌ను ప్రారంభించడం ద్వారా రిటైల్-వాణిజ్య మరియు వినోద విభాగాల్లో ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది.

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నల్లగండ్ల ప్రాంతంలో ఉన్న అపర్ణ నియో 3.67 ఎకరాలలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాదాపు 8 కి.మీ రేడియస్ లో ఉన్న ఏకైక మాల్ ఇది. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క విస్తృత వ్యాపార వైవిద్యీకరణ లక్ష్యాలకు అనుగుణంగా, అపర్ణ నియోలో రూ. 252 కోట్లు వ్యూహాత్మక పెట్టుబడిని మరియు అపర్ణ సినిమాస్‌లో రూ. 32 కోట్లు అదనపు పెట్టుబడిని అపర్ణ కన్స్ట్రక్షన్స్ చేసింది.
అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న నల్లగండ్లలోని ప్రతిష్టాత్మక ఎన్‌క్లేవ్‌లో ఉన్న అపర్ణ నియో మాల్ వైభవం మరియు ఆధునికతకు దీటుగా నిలుస్తుంది.

Aparna Constructions and Estates invests Rs 284 crore into Retail and Entertainment

80 కు పైగా ఖచ్చితమైన రీతిలో తీర్చిదిద్దిన స్టోర్‌ల ఆకట్టుకునే శ్రేణి తో , నియో ఉన్నత స్థాయి రిటైల్ అనుభవాల కోసం అత్యున్నత ప్రమాణాలను నిర్దేశిస్తుంది. అపర్ణ నియో, ఈ ప్రాంతంలోని 25,000+ ఎగువ-మధ్య మరియు ఎగువ తరగతి కుటుంబాల అవసరాలను తీర్చడానికి అంకితం చేయబడింది, విస్తృత శ్రేణి లగ్జరీ సౌందర్య సాధనాలు, అత్యాధునిక దుస్తులు, ప్రయాణ అవసరాలు, సాంకేతికత, గౌర్మెట్ డైనింగ్ మరియు ప్రీమియం నాణ్యమైన వినోద అవకాశాలను అందిస్తోంది.
అంతేకాదు , అపర్ణ నియో మాల్ విస్తృత శ్రేణి లో రిటైల్ ఆఫరింగ్స్ ను సైతం అందిస్తుంది. దీనికి మరింత సంతోషాన్ని జోడిస్తూ , అపర్ణ సినిమాస్ ఉంటుంది. ఇది సినిమా అభిమానులకు అత్యున్నత సినిమా వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.

సరికొత్త డాల్బీ సౌండ్ సిస్టమ్‌లు మరియు 4కె ప్రొజెక్షన్ స్క్రీన్‌లతో సహా అత్యాధునిక సౌకర్యాలను అపర్ణ సినిమాస్ కలిగి ఉంది. ఇది అసమానమైన ఆడియో-విజువల్ అనుభూతిని అందిస్తుంది. 1200 కు పైగా సీట్ల సినిమా, దాని స్వంత కిచెన్ ద్వారా విభిన్నమైన డైనింగ్ అవకాశాలతో గరిష్ట సౌలభ్యం అందిస్తూ ప్రీమియం సినిమా వీక్షణ అనుభవం కోసం రూపొందించబడింది.

ఈ ప్రారంభోత్సవం మరియు ఈ సంవత్సరానికి సంబంధించి కంపెనీ వ్యాపార ప్రణాళికల గురించి అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ డైరెక్టర్ శ్రీ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, "1990 నుండి, అపర్ణ గ్రూప్ వివిధ రకాల వ్యాపార విభాగాలలో ప్రవేశిస్తుండటం ద్వారా తమ పోర్ట్‌ఫోలియోను స్థిరంగా విస్తరిస్తుంది. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ ఇప్పుడు రిటైల్ రియల్ ఎస్టేట్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లోకి ప్రవేశించడం మా వృద్ధి పథంలో మరో కీలకమైన ముందడుగు. అపర్ణ నియో, మా మొదటి మాల్ ప్రారంభోత్సవానికి ప్రతీకగా నిలవటమే కాకుండా, ఈ ప్రాంతంలోని మార్కెట్ డైనమిక్స్‌పై మాకున్న లోతైన అవగాహనను కూడా వెల్లడిస్తుంది.

Aparna Constructions and Estates invests Rs 284 crore into Retail and Entertainment

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 4వ నగరంగా ఆవిర్భవించడానికి హైదరాబాద్ సిద్ధంగా ఉంది, అభివృద్ధి చెందుతున్న IT/GCC రంగం గణనీయమైన రీతిలో నూతన రెసిడెంట్స్ ను ఆకర్షిస్తుంది. ఈ వేగవంతమైన పట్టణీకరణ నివాస, వాణిజ్య మరియు రిటైల్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో పెరుగుతున్న డిమాండ్‌కు తోడ్పడుతుంది . వినియోగదారుల ఆకాంక్షలను తీర్చడానికి మేము మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాము..." అని అన్నారు.అపర్ణ సినిమాస్ ప్రారంభం తమ వినియోగదారుల కోసం మరింత అనుకూలమైన అనుభవాలను సృష్టించేందుకు అపర్ణ యొక్క వ్యూహాత్మక నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

Aparna Constructions and Estates invests Rs 284 crore into Retail and Entertainment

భారతదేశంలో వినోదం మరియు మీడియా పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది . ఇది 2027 నాటికి $73.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. అంతేకాకుండా , థియేటర్-ప్రేక్షకుల సంఖ్య కూడా 29% పెరిగి 2023లో 15.7 కోట్ల మంది వ్యక్తులకు చేరుకుంది. ప్రీమియం సౌకర్యాలు , అత్యాధునిక సాంకేతికతతో అపర్ణ సినిమాస్ సాటిలేని సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది . దక్షిణ భారతదేశంలో వినోద మార్కెట్‌ను ఒడిసి పట్టుకోగలమని ఆశాజనకంగా ఉంది.

"మేము 2027 నాటికి 4 కొత్త మాల్‌ల కోసం ప్రణాళికలను కలిగి ఉన్నాము, ప్రతి ఒక్కటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ యూనిట్‌గా అపర్ణ సినిమాస్‌ను కలిగి ఉంటుంది. అదే సమయంలో, మా ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మరియు కమర్షియల్ పోర్ట్‌ఫోలియో ఇయర్ ఆన్ ఇయర్ వరుసగా 20% మరియు 10% పెరుగుతూనే ఉంది. కొత్త అవకాశాలను అన్వేషించడానికి మరియు మా వాటాదారులకు విలువను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము, రియల్ ఎస్టేట్ ట్రయల్‌బ్లేజర్‌గా మా స్థానాన్ని సుస్థిరం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని శ్రీ రాకేష్ రెడ్డి తెలిపారు.

Aparna Constructions and Estates invests Rs 284 crore into Retail and Entertainment

దాదాపు 25 కు పైగా రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లు మరియు 70కు పైగా ఐటి కంపెనీలకు సమీపంలో వ్యూహాత్మకంగా వున్న అపర్ణ నియో, దాని సందర్శకులకు జీవనశైలి, వినోదం, నిత్యావసరాలు మరియు డైనింగ్ లో సేవలను అందించటానికి సిద్ధంగా ఉంది. మాల్‌లో అందుబాటులో వున్న కొన్ని మార్క్యూ బ్రాండ్‌లలో లైఫ్‌స్టైల్, నైకా, క్రోమా, అజోర్టే, GAP, సెంట్రో మరియు మరిన్ని ఉన్నాయి. బ్రిక్ అండ్ మోర్టార్ కంటే ఎక్కువగా అపర్ణ నియో మాల్ ప్రాతినిధ్యం వహిస్తుంది; ఇది అసమానమైన కస్టమర్ అనుభవాలను అందించడంలో సంస్థ యొక్క ముందు చూపు , ఆవిష్కరణ మరియు స్థిరమైన నిబద్ధత యొక్క కలయికను సూచిస్తుంది. ఈ మాల్ 31 మే, 2024న సందర్శకుల కోసం తమ తలుపులు తెరుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+