వరంగల్‌ NSR హాస్పిటల్‌లో అపోలో డయాలిసిస్ క్లినిక్ ప్రారంభం..!!

అపోలో హెల్త్ & లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న అపోలో డయాలసిస్ క్లినిక్స్ తన కొత్త డయాలిసిస్ కేంద్రాన్ని అపోలో రీచ్ NSR హాస్పిటల్,వ‌రంగ‌ల్‌లో ప్రారంభించింది.దీని ఉద్దేశ్యం మూత్రపిండ సమస్యలు (కిడ్నీ సమస్యలు) ఎదుర్కొంటున్న రోగులకు అత్యుత్తమ డయాలిసిస్ వైద్య సేవలు అందించడం.అధునాతన సాంకేతికతతో నిర్మించబడిన ఈ సెంటర్‌లో అనుభవజ్ఞులైన నెఫ్రోలజిస్ట్‌లు (కిడ్నీ నిపుణులు), ప్రత్యేక శిక్షణ పొందిన డయాలిసిస్ సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారు.రోగులు ఇకపై ఆరోగ్యశ్రీ ,ఇతర ప్రధాన వైద్య బీమా పథకాల ద్వారా డయాలిసిస్ సేవలను పొందొచ్చు.ఇది రోగుల కోసం ఆర్థికంగా సులభతరం చేస్తుంది. ప్రపంచస్థాయి వైద్య సేవలను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో కల్పించడమే తమ లక్ష్యంగా అపోలో డయాలసిస్ క్లినిక్స్ పేర్కొంది.

అపోలో డయాలిసిస్ క్లినిక్ ప్రారంభం సందర్భంగా ప్రముఖుల వ్యాఖ్యలు:

"డయాలిసిస్ చికిత్సలో వేగం మరియు సమగ్రత ఎంతో అవసరం.మూత్రపిండ సంబంధిత వ్యాధులను సమయానికి గుర్తించి చికిత్స చేయడం ద్వారా రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు.ఈ డయాలిసిస్ సెంటర్ ఆధునిక పద్ధతులతో కూడిన చికిత్సలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది." అని సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నిర్మల్ పాపయ్య తెలిపారు.

Apollo Dialysis starts a new clinic in NSR hospital Warangal
చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం.సుధాకర్ రావు మాట్లాడుతూ - ఈ అధునాతనమైన డయాలిసిస్ క్లీనిక్ ద్వారా అనేకమంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉన్నతమైన డయాలిసిస్ సేవలను అందించటం జరుగుతుంది . ఇక్కడ ప్రభుత్వ మరియు ప్రైవేట్ బీమా పథకాల సహకారంతో సేవలను అందించడం ద్వారా, ప్రతి డయాలిసిస్ రోగి తగిన చికిత్స పొందేలా చేయడమే మా లక్ష్యం .
భవిష్యత్తులో, అపోలో డయాలసిస్ క్లినిక్‌లు నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలకు మండలాల స్థాయికి కూడా విస్తరిస్తూ మెరుగైన వైద్య సేవలను అందించటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము.అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం తో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది సహకారంతో ప్రపంచస్థాయి డయాలిసిస్ సేవలను ప్రతి రోగికి అందేలా మరియు కిడ్నీ వ్యాధులపై ప్రజలకు అవగాహనకల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Apollo Dialysis starts a new clinic in NSR hospital Warangal

NSR గ్రూప్ ఛైర్మెన్ ఎన్.సంపత్ రావు మాట్లాడుతూ "మా హాస్పిటల్‌లో అపోలో డయాలిసిస్ క్లినిక్‌ను ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయం.అధునాతన కిడ్నీ చికిత్సను అందించడంలో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉంది. మేము మరికొందరు రోగులకు ఈ సేవలను అందించేందుకు కృషి చేస్తాము." అని చెప్పారు.

అపోలో డయాలిసిస్ క్లినిక్ గురించి:
అపోలో డయాలిసిస్ భారతదేశంలో ప్రముఖ మూత్రపిండ సంరక్షణ సేవలను అందించే సంస్థ.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,తమిళనాడు,అసోం,బీహార్,పంజాబ్,హరియాణా,ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో 140+ కేంద్రాలతో మా సేవలు విస్తరించాయి. ఇక్కడ హీమోడయాలిసిస్,పెరిటోనియల్ డయాలిసిస్,పిల్లల డయాలిసిస్,మూత్రపిండ మార్పిడి (కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్)సేవలను అందిస్తున్నారు.పల్లెటూర్లు,పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన మూత్రపిండ సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో యాజమాన్యం ఉంది.

Apollo Dialysis starts a new clinic in NSR hospital Warangal

అపోలో హెల్త్ & లైఫ్‌స్టైల్ లిమిటెడ్ గురించి:

అపోలో హెల్త్ & లైఫ్‌స్టైల్ లిమిటెడ్ (AHLL) అనేది అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ (AHEL) అనుబంధ సంస్థ.2002 నుండి,భారతదేశంలో 5500+ వైద్యులతో 20 మిలియన్+మంది రోగులకు సేవలు అందించింది.తృటిలో ఆసుపత్రి వెళ్ళాల్సిన అవసరం లేకుండా,ఇంటికి దగ్గరగా అత్యుత్తమ వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
మీడియా సంప్రదింపులకు: 9885881525

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+