Flower Festival:లులూ మాల్‌లో పూల పండగ సీజన్..భారీ సంఖ్యలో తరలివస్తున్న ఔత్సాహికులు..!
హైదరాబాద్: మీరు పూల ప్రేమికులా..? రంగు రంగుల పూలు అంటే మీకు ఇష్టమా.. ఉదయం లేవగానే కళ్ల ముందు కలర్‌ఫుల్ పూలు కనిపిస్తే ఆ రోజు ఎంతో ఆహ్లాదకరంగా ప్రారంభమవుతుంది. అయితే నిత్యం బిజీగా సాగిపోతున్న నగర ప్రజలకు పూలను చూసే సమయం దొరకడం లేదు.
ప్రకృతి ప్రేమికులకు కలర్‌ఫుల్ ఫ్లవర్స్ అన్నీ ఒకే చోటు చూసే అవకాశం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులూ మాల్ కల్పిస్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఫ్లవర్ ఫెస్టివల్ సీజన్ 1, 2024 ప్రారంభమైంది.

ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమైన ఫ్లవర్ ఫెస్టివల్ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇచ్చట రంగురంగుల పూలు, వాటి నుంచి వెదజల్లే సువాసన, సృజనాత్మకతను చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. వేదిక చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఒక బొటానికల్ వండర్‌లాండ్‌లా లులూ మాల్ దర్శనమిస్తోంది. ఈ పూల పండగను వీక్షించేందుకు నగరం నలుమూలల నుంచి సందర్శకులు, ప్రకృతి ప్రేమికులు తరలి వస్తుండటంతో గ్యాలరీ మొత్తం జనసంద్రంగా మారింది.

ఈ ఫ్లవర్ ఫెస్టివల్‌ను వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డిస్ల్పేలో ఉంచిన పూల మొక్కల నుంచి ఇంటరాక్టివ్ వర్క్ షాప్స్, గార్డెనింగ్, పూల అమరిక వరకు ఎన్నో విషయాలను నేర్చుకునే మంచి అవకాశం లులూ మాల్ ఫ్లవర్ ఫెస్టివల్ సీజన్ 1,2024 కల్పిస్తోంది.

ఇక ఫ్లవర్ ఫెస్టివల్‌ను వీక్షించేందుకు వస్తున్న సందర్శకులు పూల మొక్కలను కొనుగోలు కూడా చేయొచ్చు. రకరకాల పూల మొక్కలు, విత్తనాలు, గార్డెనింగ్ పరికరాలు,పనిముట్లు ఇవన్నీ అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్ నుంచి కొనుగోలు చేయొచ్చు.

ఇంకెందుకు ఆలస్యం వెంటనే హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులూ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కలర్‌ఫుల్ ఫ్లవర్ ఫెస్టివల్ సీజన్ 1,2024ను సందర్శించి మంచి అనుభూతిని పొందండి. ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఈ ఫ్లవర్ ఫెస్టివల్ ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.












Click it and Unblock the Notifications