MEDI 9: మెడి 9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్ : ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడి 9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ లోగోను ఆవిష్కరించింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మెడి 9 హెల్త్ సైన్సెస్ క్లినికల్ డైరక్టర్ డాక్టర్ వెంకట రామిరెడ్డి, వైద్యులు డాక్టర్ రమణ రాజు, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ విజయ లక్ష్మి మెడి 9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎన్నో వేల సంవత్సరాల నుండి వినిపిస్తున్న సూక్తి , ఎంత డబ్బు , హోదా ,సంపద ఉన్నా మంచి ఆరోగ్యం లేక పోతే ఏమి లేనట్లే. ఈ సూక్తి ని ప్రేరణ గా తీసుకుని ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ ను, సమీకృతీకరించి మెడి 9 హెల్త్ సైన్సెస్ సంస్థ హోమియోపతి, ఆయుర్వేద.

పేషెంట్ యొక్క సమగ్ర సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మంచి అవకాశాలను అందిస్తుంది. ఈ వ్యవస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఐ సి ఎం ఆర్ భాగస్వామిగా ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు జాతీయంగా ముఖ్యమైన వ్యాధుల చికిత్సలో ఇటువంటి ఏకీకరణ యొక్క ప్రయోజనాలను శాస్త్రీయంగా ధృవీకరించాలని కోరింది. ఈ సంచలనాత్మక చొరవ మిశ్రమ చికిత్సల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో కీలకమైన దశను సూచిస్తుంది. అందువల్ల ఆరోగ్య సంరక్షణకు సమగ్ర, సాక్ష్యం ఆధారిత విధానం యొక్క తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుందని తెలిపారు.

Medi9 unviels integrated medical systems logo pitches for ayurveda and Homeopathy treatment

సమగ్ర ఔషదాల ఏకీకృత వ్యవస్థ ఏమిటి? :

సమగ్ర ఔషదాల ఏకీకృత వ్యవస్థ, పేషెంట్ కి అత్యంత ప్రభావవంతమైన చికిత్సను అందించడానికి వివిధ ఆరోగ్య సంరక్షణ పద్ధతులను మిళితం చేస్తుంది. ఈ విధానం లో ఆయుర్వేదం, హోమియోపతి , నేచురోపతి ఆక్యుపంక్చర్, అక్యూప్రెషర్ ,సిద్ద యోగా ,హెర్బల్,కిరో ప్రాక్టిక్ వంటి ప్రత్యామ్నాయ లేదా సాంప్రదాయ పద్ధతులతో "పాశ్చాత్య" వైద్యాన్ని మిళితం చేస్తుంది.ఏకీకృత వ్యవస్థ యొక్క లక్ష్యం కేవలం ఒకే వ్యాధి, లక్షణంపై దృష్టి సారించడం కంటే మొత్తం వ్యక్తిని - మనస్సు, శరీరం మరియు ఆత్మకు చికిత్స చేయడం. ఇది మరింత వ్యక్తిగతీకరించిన, సమగ్ర సంరక్షణకు దారి తీస్తుంది. ఇంతే కాకుండా ఈ సమీకృత వ్యవస్థ అనారోగ్యాలకు మాత్రమే చికిత్స చేయడంతో పాటు నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్ల గురించి నొక్కి చెబుతుంది.

ఒక సమగ్ర విధానంలో విభిన్న వైద్య వ్యవస్థలను చేర్చడం వలన పేషెంట్స్ వారి ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ,ఉత్తమంగా పనిచేసే చికిత్సలను ఎంచుకోవడానికి వీలుగా ఉంటుంది.ఈ ఆధునిక యుగంలో వైద్యులు ,టెక్నాలజీ ,డయాగ్నోసిస్,కార్పొరేట్ హాస్పిటల్స్ ,మెడికల్ కాలేజ్ లు ,పెరిగాయి .అయినా దానికి రెట్టింపు వ్యాధులతో,కొత్త కొత్త రకకాలపేర్లతో ,చిన్న పిల్లలనుండి పెద్దల వరకు ఇబ్బంది పెడుతున్నాయి.50 సంవత్సరాల వారికి వచ్చే డయాబెటిస్,కీళ్ల వ్యాధులు,థైరాయిడ్,గుండె ,లివర్ సంబంధిత వ్యాధులు వంటివి ,ఇప్పుడు 20 -30 సం రా లకే వచ్చి ఎంతో బాధిస్తున్నాయి . చాలా ఆరోగ్య సమస్యలు ,మాటి మాటికీ తిరగబడి ,శారీరకంగా,సామాజికంగా,మానసికంగా ,ఆర్ధికంగా క్రుంగదీస్తాయి. అటువంటి వాటిని నిశితంగా పరిశీలించి సమగ్ర వైద్యం అందించాలి.

Medi9 unviels integrated medical systems logo pitches for ayurveda and Homeopathy treatment

ఆయుర్వేద,హోమియోపతి ,నేచురోపతి ,సిద్ధ,యోగ ,అక్యూపంక్చర్ ,అక్యూప్రెషర్ ,హెర్బల్ మరియు కైరోప్రాక్టీక్ వంటి వైద్య విదానములు వేల సంవత్స రాల నుండి ఎంతో మందికి స్వస్థత చేకూర్చాయి . అటువంటి వివిధ శాఖలకు సంబందించిన వైద్య బృందం మెడి 9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టం ను ఒకే ప్రాంగణం లో స్థాపించి అన్ని రకాల చికిత్సలకు వైద్యం చేస్తున్నారు.30 సంవత్సరాలకు పైగా అనుభవం,నిపుణత, పరిశీలనా కలిగిన డాక్టర్స్ బృందం వ్యాధి కారకాలను తెలుసుకుని వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు.తద్వారా మాటి మాటికీ తిరగబడే దీర్ఘ కాలిక మొండి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

ఈ ఇంటిగ్రేటివ్ చికిత్స లో మెడిసిన్ ,ఎక్సర్ సైజ్,డైట్,ఇమ్మ్యూనిటి బూస్టర్స్ ద్వారా చికిత్స ను అందిస్తారు.అందుకే మెడి 9 అంటే మెడిసిన్,ఎక్సర్ సైజ్,డైట్ ఇమ్మ్యూనిటి బూస్టర్.దశాబ్దాల పరిశీలన ,పరిశోధన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ నే కాకుండా ఎన్నో సంస్థలు ఈ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ చాలా శుభ పరిణామం అని తేల్చాయి. హోమియోపతి కి ఆయుర్వేదం తో పాటు , అక్యూపంక్చర్,అక్యూప్రెషర్,నేచురోపతి,పంచకర్మ ,ఫీజియోథెరపీ వంటి వైద్య విధానములు ద్వారా పేషెంట్ త్వరగా కోలుకోవటం జరుగుతుంది .

దీర్ఘ కాలిక మొండి వ్యాధులు,మాటి మాటికీ తిరగబడకుండా,వ్యాధి మూలాలకు చికిత్స చేయటమే మెడి 9 యొక్క ప్రధాన ద్యేయం.ఇక్కడ సేవాభావం,కేర్,సర్వీస్ ప్రధాన అంశాలుగా మెడిసిన్,ఎక్సర్ సైజ్ , డైట్ , కౌన్సిలింగ్ ఇస్తూ , మీ దీర్ఘ కాలిక , మొండి వ్యాధుల వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు.ఇక్కడి వైద్యులు, మీ సమస్యని పరీక్షించ,వ్యాధి కారకాలను తెలుసుకుని,వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు. తద్వారా మీ ఆ వ్యాధి మరల మరలా తిరగబెట్టకుండా ఉంటుంది. అతి తక్కువ ఖర్చు తో,నొప్పి లేకుండా వ్యాధి మూలాలకు చికిత్స చేయటమే మెడి 9 ప్రత్యేకత . చికిత్స చేయటమే కాకుండా దానికి సంబందించిన వ్యాయామాలు,ఆహార నియమాలు అన్ని సవివరంగా,వివరించి మీకు మనోస్వాంతన చేకూరుస్తారు.మీరు మర్చిపోయినా,మీ ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకుని,ఫోన్ లో మీ ఆరోగ్య విషయాలను , ఆహార నియమాలను గుర్తుచేస్తూ మీరు పేషెంట్ కాదు,మా ఫామిలీ మెంబర్ అనే ఫీలింగ్ ని మీకు కలుగ చేస్తారు.మెడి 9లో చికిత్స అంటే మీ ఇంట్లోనే చికిత్సలాగా భావించవచ్చు.

మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 9550400445

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+