Rainbow Childrens Hospital: అంబరాన్నంటిన సిల్వర్ జూబ్లీ వేడుకలు..!!
ప్రముఖ చిన్న పిల్లల ఆస్పత్రి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ డిసెంబర్ 1వ తేదీన 25వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను చాలా గ్రాండ్ నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్‌న హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్‌లో జరిపింది.ఈ కార్యక్రమానికి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఛైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల, రెయిన్‌బో హాస్పిటల్స్ లనుబంధ హాస్పిటల్ బర్త్‌రైట్‌లో ఆబ్స్‌టెట్రిక్స్ గైనకాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతి రెడ్డి, ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చిర్లతో పాటు ఇతర డాక్టర్లు సిబ్బంది హాజరయ్యారు.మొత్తంగా 4వేల మంది ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇ:దులో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు.
25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల సంబరాలు ఆద్యాంతం సరదాగా సాగాయి. 15ఏళ్లకు పైగా తమ సేవలందిస్తున్న 37 మంది ఉద్యోగస్తులను గుర్తించిన యాజమాన్యం సన్మానించింది. ఈ సందర్భంగా వారు సంస్థకు చేసిన సేవలను గురించి డా.రమేష్ కంచర్ల కొనియాడారు. వారు నిబద్ధత అంకితభావంతో ఇక్కడ పనిచేశారని గుర్తుచేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక సరదాగా సాగిన ఈ వేడుకల్లో పలువురు డాక్టర్లు ర్యాంప్ వాక్ చేసి అబ్బురపరిచారు. కాసేపు తమ వృత్తిని పక్కనబెట్టి చక్కగా ఎంజాయ్ చేశారు.మరోవైపు సంస్థలో పనిచేస్తున్న సీనియర్ టీమ్ చేసిన స్కిట్ ఒక్కింత సర్‌ప్రైజ్‌కు గురిచేసింది.

సిల్వర్ జూబ్లీ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని యాజమాన్యం విడుదల చేసింది. రెయిన్‌బో చిల్డ్రన్ హాస్పిటల్‌లో తాము పేషంట్ల పట్ల తీసుకుంటున్న జాగ్రత్త, అంకితభావంతో చేస్తున్న సేవ, నిపుణుల బృందం ఇలాంటి అంశాల మేళవింపుతో ఓ ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందించి విడుదల చేశారు. ప్రతి ఒక్కరినీ ఈ ప్రత్యేక గీతం ఆకట్టుకుంది.దీంతో పాటు 100 మంది రెయిన్‌బో హాస్పిటల్ ఉద్యోగస్తులతో కూడిన చిన్న పాటి సినిమాను కూడా ప్రదర్శించింది.
ఇక ఫోటో గ్యాలరీని కూడా ప్రదర్శించడం జరిగింది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ 1999లో ప్రారంభించిన నాటి నుంచి ఈ 25 ఏళ్లలో సాధించిన విజయాలను, ఇందులో భాగమైన వారిని ఫోటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. దీన్ని చూసిన సిబ్బంది తమ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఇక ఎంప్లాయిస్ కోసం ఎక్స్‌పీరియన్స్ జోన్లను ఏర్పాటు చేశారు. ఈ 25 ఏళ్లలో తాము పొందిన అనుభూతిని జ్ఞాపకాలను అక్కడ చెప్పుకునే అవకాశం కల్పించారు.

"సిబ్బంది పాతికేళ్ల కష్టం, అంకితభావంతో కూడిన సేవ,టాలెంట్, టీమ్‌వర్క్‌కు సాక్ష్యంగా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిలిచాయి.మా క్లినికల్స్ నైపుణ్యం ద్వారా కొన్ని లక్షల కుటుంబాల్లో సంతోషం నింపగలిగినందుకు తృప్తిగా ఉంది. చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన వాతావరణంతో పాటు బలమైన సిబ్బంది ఉండటంతోనే ఇది సాధ్యపడింది. భవిష్యత్తులో మరింత బలమైన సేవ చేసి మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటామన్న నమ్మకం ఉంది" అని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల అన్నారు.
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ గురించి...
1999లో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.పీడియాట్రిక్స్,ఆబ్స్‌టెట్రిక్స్,గైనకాలజీ,ఫెర్టిలీటీల చికిత్స ఇక్కడ ప్రత్యేకం.ఈ 25 ఏళ్లు రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆరోగ్య రంగంలో స్థిరమైన ఫలితాలను చూపించింది. ముఖ్యంగా పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్,రీనల్ ట్రాన్స్‌ప్లాంట్,బీఎంటీ లాంటి కష్టతరమైన చికిత్సలు అందుబాటులో ఉన్న అడ్వాన్స్‌డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగించి నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో మంచి సక్సెస్ రేట్‌ను చూపించగలిగింది.ఇక రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ గ్రూప్‌నకు దేశవ్యాప్తంగా మొత్తం 19 హాస్పిటల్స్ 4 క్లినిక్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పీడియాట్రిక్ కార్డియాక్ కేర్ సెంటర్ (చిన్నపిల్లల గుండె సంబంధిత కేంద్రం) రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్‌టిట్యూట్ హైదరాబాదులో ఉంది.












Click it and Unblock the Notifications