వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్రవరి 2న 'తెలంగాణ తోవలు' ఆవిష్కరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

తెలంగాణ సాంస్కృతిక వేదిక 2001లో వివిధ రచయితలతో రాయించిన వ్యాసాలతో వెలువరించిన 'తెలంగాణ తోవలు' పుస్తకం మలి ముద్రణ వచ్చింది. ఈ పుస్తకావిష్కరణ సభ ఆంధ్ర సారస్వత పరిషత్‌, బొగ్గులకుంట, హైదరాబాద్‌‌లో ఫిబ్రవరి 2, 2014 (ఆదివారం) జరుగుతుంది.

ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆ సభ జరుగుతుంది. పుస్తకాన్ని జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఆవిష్కరిస్తారు. ముఖ్య అతిథిగా బి. నరసింగరావు, బహుముఖ ప్రజ్ఞాశాలి విచ్చేస్తారు. సభకు అధ్యక్షత వన్ ఇండియా తెలుగు ఎడిటర్, పుస్తక సంపాదకుడు కాసుల ప్రతాపరెడ్డి వహిస్తారు.

Telangana Tovalu will be released on Feb 2

వక్తలుగా మల్లేపల్లి లక్ష్మయ్య, కో చైర్మన్‌, తెలంగాణ జెఎసి, డిపి రెడ్డి, అధ్యకక్షులు, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం, ఇండియా, గంప వేణుగోపాల్‌, వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ ఎన్నారై ఫోరం, లండన్‌ హాజరవుతారు.

రెండవ సమావేశంలో 'తెలంగాణ తోవలు' రచయితల స్పందనలు ఉంటాయి. ఈ సమావేశానికి అధ్యక్షత ప్రముఖ రచయిత స్కైబాబ వహిస్తారు. వ్యాసరచయితలు పి. వేణుగోపాల్‌, కాసుల లింగారెడ్డి, కె. శ్రీనివాస్‌, అల్లం నారాయణ, శ్రీధర్‌ రావు దేశ్‌పాండే, కాంచనపల్లి, కాలువ మల్లయ్య, గూడ అంజయ్య, లోకేశ్వర్‌, నందిని సిధారెడ్డి, కందుకూరి రమేష్‌బాబు, గుడిపాటి, సురేంద్రరాజు, ఎస్‌. రామకృష్ణ, ఇ. శోభారాణి భట్‌, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి స్పందనలు వినిపిస్తారు.

అనంతరం కవి సమ్మేళనం ఉంటుంది. హైదరాబాద్‌ కవుల వేదిక ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ఉంటుంది. దీనికి అధ్యక్షత ప్రముఖ కవి డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌ వహిస్తారు.

English summary
Telangana Tovalu book will be released on February 2 at Andhra Saraswatha parishad hall, Hyderabad by Justic Sudarshan Reddy. B Narasing Rao will grace the occasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X