తెలుగు కవిత: తీపి గాయాల యుగళగీతం

తెలుగు కవి నాగరాజు కువ్వారపు తీపి గాయాల యుగళగీతం అనే కవిత రాశారు. జీవితంలో ప్రేమ, స్నేహానికి ఉన్న ప్రాధాన్యతకు అద్దం పట్టేలా ఈ కవిత సాగుతుంది.

*తీపి గాయాల యుగళగీతం*

పరిపూర్ణత్వం కోసం
పరితపించాలో
ఆత్మ సంతృప్తికోసమే
ప్రయత్నించాలో
అంతుచిక్కదు

'జీవనప్రయాణం'
నింగి నేలల మధ్య వివేచన
చీకటి వెలుగుల విశ్వరచన

తన జ్ఞాపకాలను
ఒడిసిపడతాం
కొన్ని గురుతులుగా దాచిపెడతాం
ఎందుకో చెప్పలేము

Wounded poem of Nagaraju Kuvvarapu

'స్త్రీ'
దాంపత్య చదరంగంలో గెలిచిన రాజు
జీవిత రణరంగంలో ఓడిన మంత్రి

సరదాలతో కొనసాగే ప్రయాణం
బాధనైనా
ఓర్పుగా భరించే ప్రమాణం
ఎంతకీ విడిపోదు

'స్నేహం'
వస్తువు కాని పుస్తకం
వత్తిడి కానివ్వని వ్యక్తిత్వం

నిశ్శబ్ద యుద్దానికి
కదిలిపోవాలో
నిర్బంధ ప్రేమలో
మునిగిపోవాలో
ఎవ్వరికీ తెలువదు

'ప్రేమ'
ఓ అంతుచిక్కని ప్రయోగం
అంతుచూడలేని రహస్యం

తనొక స్వప్నం
తన సాధనకై తపనపడాలో
తనొక విప్లవం అని పోరాడాలో
అర్థం కాదు

జీవితం
తీపి గాయాల యుగళ గీతం
గెలుపు ఓటముల సంగీతం

-నాగరాజు కువ్వారపు
8688154469

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+