కళ్లు జిగేల్ అనే బంపర్ ఆఫర్.. 8,299కే 5జీ ఫోన్

ఈరోజుల్లో కరెంట్ లేని ఇల్లు అయినా ఉంటుందో లేదో గానీ, సెల్ ఫోన్ లేని ఇల్లు మాత్రం లేదు. అడుక్కునే వ్యక్తి నుంచి అంబానీ వరకూ అందరి చేతిలోనూ సెల్ ఫోన్ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి ఫోన్లు కొనుగోలు చేస్తుంటారు. ఒక్కోసారి మనకి కావాల్సిన రేట్ లో ఫోన్ దొరికినా అవసరమైన ఫీచర్స్ ఉండవు. సరే ఎక్కువ రేటు అయినా పర్లేదు....ఫీచర్స్ ఉండే కాస్ట్లీ ఫోన్ నే తీసుకుంటాం. కానీ అందరూ అలా కొనే సౌకర్యం ఉండదు. డబ్బుల్లేకో, పరిస్థితులు బాగోలేకో....ఉన్నదాంతో సరిపెట్టుకుంటాం.

అందుకే తక్కువ ధరకే అన్ని ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఓ సెల్ ఫోన్ కంపెనీ ప్రెజెంట్ చేస్తున్న ఆఫర్స్ చూస్తే...కళ్లు జిగేల్ మంటాయ్. మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందులోనే ఉన్నాయి. 5జీ యూజర్స్ కోసం చౌక అయిన 5జీ ఫోన్ రిలీజ్ చేసింది రెడ్ మీ.. ఆ మొబైల్ ఏంటి ? ఏమేం ఫీచర్స్ ఉన్నాయో.. మీకోసం ప్రత్యేకంగా..

5g smart phone for only 8 299 what is that

వాలెంటైన్స్ డే సందర్భంగా లవర్స్ కోసం రెడ్ మీ సంస్థ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రెడ్ మీ A4 5G ఫోన్ పై ప్రజెంట్ భారీ డిస్కౌంట్ సేల్ నడుస్తోంది. 2024లో రెడ్‌మీ కంపెనీ లాంచ్ చేసిన ఈ ఫోన్ ధరను తగ్గించింది. 8,500 రూపాయలకే అమెజాన్‌లో అమ్మకానికి పెట్టింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఏంటో తెలుసుకుందాం...

ఫీచర్లు..

6.88-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే

1640 X 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌

డిస్ ప్లే 120Hz రిఫ్రెష్ రేట్

240Hz టచ్ శాంప్లింగ్ రేట్

600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ సపోర్ట్

క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్‌

4 నానో మీటర్ ఫ్యాబ్రికేషన్, అడ్రినో GPU

ఆండ్రాయిడ్ 14 హైపర్ ఓఎస్‌

కెమెరా..

డ్యూయల్ కెమెరా సెటప్ - 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

బ్యాటరీ..

5160mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 33W అడాప్టర్ అందిస్తారు

స్టోరేజ్..

4GB RAM+ 4GB వర్చువల్ RAM

64GB +128GB స్టోరేజ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

ధర..

4GB + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర 8,499

4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 9,499. ప్రస్తుతం 25శాతం డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తున్నారు.

అలానే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఈ మొబైల్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 5, బ్లూటూత్ 5, GPS, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో పోర్ట్ ఉన్నాయి. ఈ మొబైల్ స్పార్కిల్ పర్పుల్, స్టార్రీ బ్లాక్ కలర్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+