Day in Google: గూగుల్‌లో వర్క్‌లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..? టెక్కీ షేర్ చేసిన ఈ వీడియో చూసేయండి

Google work day: చదువు పూర్తయిన తర్వాత మంచి మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం సాధించాలని చాలామంది కలగంటారు. అయితే ఆక్కడ పని ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్రవర్తించాలి అనే భయాలు కూడా కొందరిలో ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారీ కంపెనీల్లో పనివాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మరికొందరు ఆశ పడుతుంటారు. కాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన రోజువారీ పని ఎలా ఉంటుందో వివరిస్తూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌లో వర్కింగ్ అనేది యువత కలగా చెబతుంటారు. సంస్థ బెంగళూరు కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దివ్యాన్షి అనే టెక్కీ తమ కార్యాలయంలో వర్క్ కల్చర్ గురించిన ఓ వీడియో షేర్ చేసింది. ఇక్కడ పని చేయడం వల్ల ప్రోత్సాహకాలు మరియు సవాళ్లను ఆమె ఇందులో వివరించింది.

A day in google employee worklife

వీడియో ప్రకారం.. గూగుల్ ఇంటర్నల్ క్యాబ్ షెడ్యూలింగ్ సర్వీస్ G-Cab ద్వారా దివ్యాన్షి పనిదినం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైంది. బెంగళూరు ట్రాఫిక్‌ను దాటుకుని బాగ్‌మనే టెక్ పార్క్‌లోని సుందరమైన గూగుల్ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం ఆఫీసు వద్ద అల్పాహారం తీసుకుంది. ప్రతి భవనంలోనూ అనేక కేఫ్‌లు ఉండగా.. ఎంచుకోవడానికి వివిధ రకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయి. హాట్ చాక్లెట్ సహా ఆమెకు ఇష్టమైన భోజనంతో తన రోజును ప్రారంభించింది.

పని మొదలైనప్పటి నుంచి నెమ్మదిగా డిజైన్-ఆధారిత మరియు కోడింగ్ వర్క్ మధ్య మారుతూ కనిపించింది. కోడింగ్ సెషన్‌ల మధ్య గూగుల్ సృజనాత్మకంగా రూపొందించిన మీటింగ్ రూమ్‌లలో సమావేశాలకు హాజరైంది. ఇక సాయంత్రం పూట పని ముగించుకుని, రద్దీగా ఉండే ట్రాఫిక్‌ను తప్పించుకోవడానికి తన G-క్యాబ్‌ని షెడ్యూల్ చేస్తుంది.

అయితే రోజులోని ముఖ్యాంశాలలో మిడ్‌వీక్ ఐస్ క్రీం కౌంటర్‌ను ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రతి బుధవారం ఉద్యోగులకు ఒక ప్రత్యేక ట్రీట్‌ ఉంటుంది. కాగా ఈసారి బాస్కిన్ రాబిన్స్. దివ్యాన్షి టాపింగ్స్ ఎంపికతో కుకీస్ మరియు క్రీమ్ కోన్‌ని ఎంచుకుంది. గూగుల్ మైక్రో కిచెన్‌లు మరొక ప్రత్యేక ఆకర్షణ. ఇది కంపెనీ వ్యవస్థాపకులచే ప్రేరణ పొంది రూపొందించబడింది. ఏ ఉద్యోగికైనా 20 అడుగుల లోపు ఆహారాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా వారిని శక్తివంతంగా ఉంచాలనేది సంస్థ ఆలోచనగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+