వీడియో: అగ్నిపర్వతం పేలితే ఎట్టా ఉంటాదంటే.. !!
జపాన్ లోని సకురాజిమా అగ్నిపర్వతం తీవ్రంగా విస్ఫోటనం చెందింది. ఆ దేశ కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:57 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్దిరోజులుగా పొగ విరజిమ్మతూ వచ్చిన ఈ వాల్కనో.. ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో 14,400 అడుగుల ఎత్తు వరకు బూడిద ఎగిసింది. బూడిద మేఘాలు అలముకున్నాయి. దీని కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సమీప ప్రాంతాలకు బూడిద, రాళ్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
మినిడాకే పర్వత శిఖం అయిదో స్టేషన్ వరకు భారీ అగ్నిపర్వత శిలలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని, ఆస్తులకు నష్టం జరగలేదని జపాన్ వాతావరణ సంస్థ ధృవీకరించింది. ప్రాణాంతక పైరోక్లాస్టిక్ ప్రవాహాలు నమోదు కాలేదని వాతావరణ సంస్థ అధికారులు తెలిపారు. ప్రధాన పేలుడు తర్వాత అగ్నిపర్వత నుంచి దాదాపు 12 గంటల పాటు మధ్యస్థాయి పేలుళ్లు సంభవించాయి. రోజంతా వాల్కనో యాక్టివిటీస్ కొనసాగాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

వేకువజామున 2:30, ఉదయం 8:50 గంటలకు మరో రెండు విస్ఫోటనాలు నమోదయ్యాయి. బూడిద మేఘాల కారణంగా విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రత కారణంగా కగోషిమా విమానాశ్రయం నుండి సుమారు 30 విమానాలు రద్దయ్యాయి. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు విమానాలను పునరుద్ధరించబోమని ఆ దేశ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకనట విడుదల చేసింది.
సకురాజిమా.. అత్యంత క్రియాశీలకంగా ఉండే స్ట్రాటోవోల్కనోగా గుర్తింపు పొందింది. కగోషిమా ప్రిఫెక్చర్‌లో ఉంటుందీ ద్వీపకల్పం. రాజధాని టోక్కో నుంచి 1,325 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ప్రాంతంలో ఉండే ప్రీఫెక్షర్ ఇది. ఒకప్పుడు ఐలాండ్ గా ఉండేది. 1,914లో సంభవించిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా వెలువడిన లావా ప్రవాహాలు, ఈ ద్వీపాన్ని ఓసుమి ద్వీపకల్పంతో అనుసంధానించాయి. ఫలితంగా ద్వీపకల్పంగా మారింది.
Sakurajima in Japan a couple of hours ago 😍
— Volcaholic 🌋 (@volcaholic1) November 15, 2025
Volcanic lightning too.
Wait for the big ⚡️ at the end.
Link to livestream 👇 pic.twitter.com/nYaE0njFXN
తాజా పేలుడు వల్ల కగోషిమా, కుమమోటో, మియాజాకి వంటి సమీప జిల్లాలకు బూడిద పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు బయట ఉన్నప్పుడు గొడుగులు, మాస్కులు ధరించాలని, బూడిదతో కప్పబడిన రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ విస్ఫోటనం భారీ స్థాయిలో ఉన్నప్పటికీ, వొల్కనో వార్నింగ్ లెవెల్-3ని జారీ చేశారు అధికారులు. రాబోయే రోజుల్లో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని స్థానిక వొల్కనో అబ్జర్వేటరీ తెలిపింది.












Click it and Unblock the Notifications