600 ఏళ్లుగా నిద్రాణంలో ఉన్న అగ్నిపర్వతం పేలితే ఎట్టా ఉంటాదో తెలుసా?

Volcano erupts in Russia: రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. అంచనాలకు అందని విధంగా భూమి ప్రకోపించింది. ఆ దేశాన్ని వణికించింది. అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇది. దీని ప్రభావం జపాన్ పైనా పడిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మొన్నటికి మొన్న 8.8 తీవత్రతో సంభవించిన భూకంపంతో ఊగిపోయింది రష్యా. సునామీకి కారణమైంది. జపాన్, అమెరికా, ఫిలిప్పీన్స్ సహా పలు పసిఫిక్ తీర ప్రాంత దేశాలు భయంకపితులయ్యాయి. కొన్ని గంటల పాటు సునామీ ప్రభావం కనిపించింది. రాకాసి అలలు జపాన్ ను కంటి మీద కునుకు లేకుండా చేశాయి.

A volcano erupted after 600 years in Russia

ఇప్పుడు తాజాగా అలాంటి పరిస్థితే ఏర్పడింది. రష్యాలోని కురిల్ దీవుల తూర్పు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0గా నమోదైంది. ఈ ఉదయం 11:07 నిమిషాలకు 50.76 ఉత్తర అక్షాంశం, 157.71 తూర్పు రేఖాంశం వద్ద భూమి ప్రకోపించింది.

మూడు రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇది. ఈ నెల 1వ తేదీన ఇదే కురిల్ ఐలండ్స్ లో 6.2 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే. పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ద్వీప సముదాయం ఇది. క్రియాశీలక అగ్నిపర్వతాలకు పెట్టింది పేరు. 20 నుంచి 25 వేల వరకు జనాభా ఉంటుందిక్కడ.

డిస్ప్యూటెడ్ ఐలండ్స్ లల్లో ఇదీ ఒకటి. రష్యా, జపాన్ దీన్ని తమదిగా చెప్పుకొంటోన్నాయి. రష్యా సఖాలిన్ ప్రావిన్స్ ప్రభుత్వం తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని క్రెమ్లిన్ ప్రకటించింది.

భూకంప తీవ్రత నేపథ్యంలో స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు. తొలుత సునామీ సంభవించే ప్రమాదం ఉండొచ్చని వార్తలొచ్చినప్పటికీ.. అలాంటిదేమీ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా- రష్యా తీరంలో 8.8 తీవ్రత భూకంపం తర్వాత 16 గంటల్లో 4.4 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన ప్రకంపనలు దాదాపుగా 125 వరకు చోటు చేసుకున్నాయి.

ఈ వరుస భూకంపాల ప్రభావం.. అక్కడి అగ్నిపర్వతంపై పడింది. ఒక్కసారిగా పేలింది. 600 సంవత్సరాలుగా నిద్రాణంగా ఉంటూ వస్తోన్న అగ్నిపర్వతం ఇది. దీని పేరు- క్రాషెనిన్నికోవ్. ఇది విస్ఫోటనం చెందడానికి వరుసగా సంభవించిన శక్తిమంతమైన భూకంపాలే కారణమని అంచనా వేస్తోన్నారు.

కమ్చట్స్కా రీజియన్ లో ఉందీ అగ్నిపర్వతం. ఇదే రీజియన్ లో వరుస భూకంపాలు సంభవిస్తోన్నాయి ఈ మధ్యకాలంలో. వాల్కనో ఏటవాలుపై తొలుత పగుళ్లు కనిపించాయని, అవి ఏర్పడిన కొన్ని గంటల్లోనే లావా ఉప్పొంగిందని ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అనంతరం పెద్ద శబ్దం చేస్తూ అగ్నిపర్వతం పేలిందని పేర్కొంది.

అగ్నిపర్వతం పేలిన అనంతరం కొన్ని కిలోమీటర్ల వరకు బూడిద.. 6,000 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడింది. సమీప ప్రాంతాల్లో వర్షంలా కురిసింది. 600 సంవత్సరాలలో క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ఇదే మొదటిసారిని న్యూస్ ఏజెన్సీ ప్రతినిధురాలు ఓల్గా హిరానా తెలిపారు.

క్రాషెనిన్నికోవ్ చివరి విస్ఫోటనం 1463లో సంభవించిందని, అప్పటి నుండి ఎటువంటి పేలుళ్లు నమోదు కాలేదని హిరినా వివరించారు. నిద్రాణస్థితిలో ఉంటూ వచ్చిందని వివరించారు.

అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత, 6,000 మీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిందని రష్యన్ అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి ఈ అగ్నిపర్వతం 1,856 మీటర్ల ఎత్తులో ఉంది. అగ్నిపర్వత విస్ఫోటనంతో పౌర విమానయాన అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ మార్గాన్ని నివారించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+