ఎయిర్‌టెల్ యూజర్లకు నెక్స్ట్ లెవెల్ ఆఫర్.. ఏడాది పాటు ఫ్రీ !
దేశవ్యాప్తంగా ఉన్న తన 36 కోట్లకు పైగా వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ మరో ఉచిత డిజిటల్ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన పర్ప్లెక్సిటీ ఏఐ ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందించిన ఎయిర్‌టెల్, ఇప్పుడు అదే తరహాలో మరో భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈసారి వినియోగదారులకు 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ సేవ కోసం ఎయిర్‌టెల్ తాజాగా అడోబ్ కంపెనీతో కొత్త భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఆఫర్ ద్వారా సాధారణంగా దాదాపు ₹4,000 విలువ చేసే అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సేవను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పొందే అవకాశం లభిస్తోంది. డిజిటల్ సేవలపై ఫోకస్ పెంచుతున్న ఎయిర్‌టెల్, ఇలాంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ద్వారా తన వినియోగదారులను మరింత బలంగా కట్టిపడేస్తోంది. పర్ప్లెక్సిటీ ఏఐ తర్వాత ఇప్పుడు అడోబ్ లాంటి గ్లోబల్ బ్రాండ్‌తో భాగస్వామ్యం కావడం.. ఎయిర్‌టెల్ డిజిటల్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందగలిగే కస్టమర్లు..
అన్ని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులు
అన్ని పోస్ట్‌పెయిడ్ మొబైల్ వినియోగదారులు
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు
ఎయిర్‌టెల్ బ్లాక్ వినియోగదారులు
డీటీహెచ్ (DTH) కస్టమర్లు..
ఒకసారి ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకుంటే, పూర్తి 12 నెలల పాటు ఎలాంటి రీన్యూవల్ ఛార్జీలు లేకుండా ఈ సేవను వాడుకోవచ్చు.
12 నెలల తర్వాత ఏం జరుగుతుంది?
ఉచిత కాలపరిమితి ముగిసిన తర్వాత, వినియోగదారులు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సేవను కొనసాగించాలనుకుంటే, అప్పటికి వర్తించే సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కంటిన్యూ చేయకపోతే, ఆటోమేటిక్‌గా ఉచిత కాలం తర్వాత సేవ నిలిపివేయబడుతుంది. దీంతో వినియోగదారులకు ఎలాంటి అనుకోని ఛార్జీలు పడే అవకాశం ఉండదని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది.
అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంతో ఏం చేయొచ్చు?
సోషల్ మీడియా పోస్టులు, రీల్స్, థంబ్‌నెయిల్స్ డిజైన్ చేయడం
రెడీమేడ్ ప్రీమియం టెంప్లేట్స్ ఉపయోగించడం
లాగోలు, పోస్టర్లు, ఫ్లయర్లు, బిజినెస్ కార్డులు తయారు చేయడం
ఏఐ ఆధారిత డిజైన్ టూల్స్‌తో వేగంగా కంటెంట్ క్రియేట్ చేయడం
వాటర్‌మార్క్ లేకుండా హై-క్వాలిటీ డిజైన్స్ డౌన్‌లోడ్ చేయడం
ఈ ఫీచర్లు ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్స్, స్టూడెంట్స్, చిన్న వ్యాపారులు, సోషల్ మీడియా మేనేజర్స్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి?
ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందాలంటే వినియోగదారులు ఈ స్టెప్స్ ఫాలో కావాలి:
స్మార్ట్‌ఫోన్‌లో Airtel Thanks యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి
తమ ఎయిర్‌టెల్ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి
యాప్ హోమ్ స్క్రీన్‌లో లేదా ఆఫర్స్ సెక్షన్‌లో 'Adobe Express Premium' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
అక్కడ కనిపించే సూచనలను ఫాలో చేసి సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి
ఒకవేళ ఆ ఆప్షన్ కనిపించకపోతే, యాప్‌లోని సెర్చ్ బాక్స్‌లో "Adobe Express" అని టైప్ చేసి వెతికితే సులభంగా దొరుకుతుంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications