నేడే సూర్యగ్రహణం- కనిపించే దేశాలు: విజువల్ వండర్

నేడు సూర్యగ్రహణం. ఈ సంవత్సరం మొట్టమొదటి సూర్యగ్రహణం సంభవించబోతోంది. సూర్యగ్రహణాలు ఏర్పడటం సాధారణమే అయినప్పటికీ.. దీనికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అందుకే దీనికోసం శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ వీక్షకులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్నారు. నాసా, యూరోపియన్ స్పేస్ సెంటర్స్ ఈ సూర్యగ్రహణాన్ని లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి. ఇది యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్.. అంటే వార్షిక సూర్యగ్రహణం. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ గా కూడా పిలుస్తారు.

చంద్రుడి ఛాయ చుట్టూ ప్రకాశవంతమైన వృత్తాకార సూర్యకాంతి వలయం ఏర్పడుతుంది. ఇటువంటి గ్రహణాలు దృశ్యపరంగా అద్భుతమైనవి. ఈ గ్రహణ కాలం మొత్తం రెండు గంటలకు పైగా కొనసాగనుంది. ఇది సాయంత్రం 5:26కు ప్రారంభమౌతుంది. 7:57 నిమిషాల వరకు ముగుస్తుంది. రింగ్ ఆఫ్ ఫైర్ గరిష్ట సమయం సుమారు 2 నిమిషాల 20 సెకన్ల పాటు ఉంటుంది. కనువిందు చేస్తుంది.

Annular solar eclipse will turn sun into a dramatic ring of fire today as Visual Wonder for Skygazers

భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందనేది తెలిసిన విషయమే. యాన్యులార్ సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు భూమి నుండి మరింత దూరంలో ఉండటం వల్ల అది సూర్యుని కంటే చిన్నదిగా కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం కారణంగా చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పలేడు. దాని అంచులు ప్రకాశవంతమైన వలయంగా నిప్పుల కుంపటిలా కనిపిస్తాయి. అందుకే దీనికి రింగ్ ఆఫ్ ఫైర్ అని పేరు.

యాన్యులార్ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యునిలో దాదాపు 96 శాతం కప్పి ఉంచుతాడు. చంద్రుడు భూమి నుండి ఎక్కువ దూరంలో ఉండటం వల్ల అది కొద్దిగా చిన్నదిగా కనిపిస్తుంది సూర్యుడిని పూర్తిగా నిరోధించదు. ఫలితంగా సూర్యుని బయటి అంచు ప్రకాశవంతమైన వృత్తాకార వలయాన్ని ఏర్పరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా అరుదైన దృశ్యం. అదే దీని ప్రత్యేకత. ఈ సూర్యగ్రహణం భారత్ లో ఎక్కడా కనిపించదు

దక్షిణార్ధగోళంలోని అనేక ప్రాంతాల ప్రజలు దీన్ని చూడగలుగుతారు. ఈ అద్భుత ఖగోళ సంఘటనను నేరుగా చూడగలిగే దేశాల్లో దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, చిలీ, టాంజానియా, నమీబియా, జింబాబ్వే, మొజాంబిక్, మడగాస్కర్, బోట్సువానా వంటివి ఉన్నాయి. అంటార్కిటికా, మారిషస్, సౌత్ జార్జియా, బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ, ఫ్రెంచ్ సదరన్ టెరిటరీస్ వంటి ఇతర సుదూర ప్రాంతాల నుండి కూడా ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. రింగ్ ఆఫ్ ఫైర్ ను ప్రత్యక్షంగా వీక్షించగలుగుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+