ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. 17 సిరీస్ లాంఛ్ డేట్ ఫిక్స్ !
టెక్ దిగ్గజం యాపిల్ కొత్త ఐఫోన్ సిరీస్‌ను ఆవిష్కరించేందుకు టైమ్ ఫిక్స్ చేసింది. Awe dropping.. పేరుతో వచ్చే మంగళవారం (సెప్టెంబర్ 9న) ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనుంది. ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈసారి ఐఫోన్ డిజైన్‌లో గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ మార్పులు ఉండబోతున్నాయని, 'ప్లస్' మోడల్ స్థానంలో సరికొత్తగా 'ఐఫోన్ 17 ఎయిర్'ను పరిచయం చేయనున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది.
మోడల్స్ జాబితా..
ఈసారి ఆపిల్ నాలుగు మోడల్స్‌ను ఆవిష్కరించనుంది:
iPhone 17
iPhone 17 Air
iPhone 17 Pro
iPhone 17 Pro Max

ఐఫోన్ 17 ఎయిర్ ఫీచర్స్..
లీకులు, సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఐఫోన్ 17 ఎయిర్ కేవలం 5.5 మిల్లీమీటర్ల మందంతో ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్ల లోనే అత్యంత సన్నని మోడల్‌గా రికార్డు సృష్టించబోతోందని అంటున్నారు. ఈ డిజైన్‌కు మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్ ఎయిర్ ప్రేరణగా నిలిచాయని చెబుతున్నారు.
- 6.6 అంగుళాల డిస్‌ప్లే
- ప్రోమోషన్ సపోర్ట్
- A19 ప్రాసెసర్
- ఫిజికల్ సిమ్ లేకుండా కేవలం eSIM సపోర్ట్
అయితే, ఈ మోడల్‌లో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రచారం. వెనుక భాగంలో ఒకే కెమెరా ఉండనుందని టాక్.
ప్రో & ప్రో మ్యాక్స్ ఫీచర్స్..
- ఐఫోన్ 17 ప్రో మోడల్స్ కెమెరా విభాగంలో భారీ మార్పులు తీసుకురానున్నాయి.
- 48MP ప్రైమరీ సెన్సార్
- అల్ట్రా వైడ్ లెన్స్
- టెలిఫోటో పెరిస్కోప్ జూమ్ లెన్స్
- మెరుగైన నైట్ మోడ్
- 8K వీడియో రికార్డింగ్, ProRes HDR సపోర్ట్
ఇక ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లో 5,000mAh బ్యాటరీ అమర్చనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటివరకు ఐఫోన్‌లోనే అతిపెద్ద బ్యాటరీగా నిలవనుంది.
హార్డ్‌వేర్ & ప్రాసెసర్..
ఈ సిరీస్ అంతటా A19 Pro Bionic చిప్ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇది 3nm ఆర్కిటెక్చర్పై ఆధారపడి, మెరుగైన AI ప్రాసెసింగ్ సామర్థ్యాలు కలిగి ఉంటుందని అంచనా.

కొత్త కలర్స్..
ఈ సిరీస్‌లో ఆకుపచ్చ, పర్పుల్ వంటి తాజా రంగులు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భారతీయ ధరల అంచనా..
iPhone 17 బేస్ మోడల్ - రూ.89,900 నుంచి
iPhone 17 Air - సుమారు రూ.94,900 - రూ.95,000 వరకు
iPhone 17 Pro - సుమారు రూ.1,21,900
iPhone 17 Pro Max - సుమారు రూ.1,39,900 - రూ.1,64,900 వరకు
అదనపు ప్రోడక్ట్స్..
ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు ఈ ఈవెంట్‌లో యాపిల్ కొత్త Apple Watch, అప్‌డేటెడ్ పాడ్స్ ను కూడా లాంచ్ చేయనుంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications