మనం తప్పించుకున్నాం గానీ.. చంద్రుడికి పెను ముప్పు?
Asteroid hitting Moon: అంతరిక్షంలో గతి తప్పిన ఓ గ్రహశకలం చంద్రమండలాన్ని వణికిస్తోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. చందమామను ఢీ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. దీనికి గల అవకాశాలను పెంచుకుంటూ వెళ్తోంది.
విశ్వాంతరాల్లో గ్రహ శకలాలు, ఉల్కాపాతాలు సర్వసాధారణమే. అవి దారి తప్పి దిశా తెన్నూ లేకుండా తిరుగాడుతుంటాయి. గతంలో అనేక అస్టరాయిడ్స్ భూమికి అత్యంత సమీపంలో దూసుకెళ్లిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికీ భిన్నంగా తాజాగా ఓ గ్రహ శకలం మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది.

వైఆర్4 గ్రహశకలం.. 2032లో భూమిని ఢీ కొట్టడానికి 3.1 శాతం అవకాశాలు ఉన్నాయంటూ ఇదివరకు నాసా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి తేదీని కూడా ఖరారు చేసింది. 2032 డిసెంబర్ 22వ తేదీన ఈ అస్టరాయిడ్ భూమిని ఢీ కొడుతుందని అప్పట్లో వెల్లడించింది. ఆ తరువాత ఆ అవకాశం లేదని తేల్చిచెప్పింది.
ఇదే ముప్పు.. చందమామకు పొంచివుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2032లో భూమికి అతి సమీపం నుంచి దూసుకెళ్లే ఈ గ్రహశకలం నేరుగా చంద్రుడిని ఢీ కొడుతుందని నాసా వెల్లడించింది. జేమ్స్ వెబ్ స్పేస్ నియర్ ఇన్ ఫ్రారెడ్ టెలిస్కోప్ ద్వారా ఆ గ్రహశకలం కదలికలను అంచనావేశామని, ఆ తరువాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వివరించింది.
ఈ వైఆర్4 అస్టరాయిడ్ చందమామను ఢీ కొట్టడానికి గల అవకాశాలను 3.8 శాతంగా ప్రకటించింది నాసా. తాజాగా దీన్ని సవరించింది. 4.3 శాతంగా నిర్ధారించింది. ఈ స్థాయిలో తన అంచనాలను సవరించడం నాసాకు ఇదే తొలిసారి. దాని కదలికల ఆధారంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలను నాసా కొట్టివేయట్లేదు. మరింత పెరిగే అవకాశమే ఉందని సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ పేర్కొంది.
ఆ అస్టరాయిడ్ విస్తీర్ణం 177 అడుగులు. దాదాపుగా 54 మీటర్లు ఉంటుంది. ఓ అపార్ట్‌మెంట్ ఎత్తును పరిమాణంగా తీసుకోవచ్చు. అంత భారీగా గ్రహ శకలం కావడం వల్లే దీనికి సిటీ కిల్లర్ అని గతంలో పేరు పెట్టింది నాసా. పొరపాటున ఏ నగరం మీద పడ్డా.. దాని నామరూపాలు ఈ భూగోళంపై నుంచి మటుమాయం కావడం ఖాయమని తేల్చిచెప్పింది.
2032 డిసెంబర్ 22వ తేదీన ఈ వైఆర్ 4 అస్టరాయిడ్ భూమిని ఢీ కొడుతుందని స్పష్టం చేసింది నాసా. సాధారణంగా నాసా వేసిన అంచనాలేవీ తప్పవు. దాదాపుగా 100 శాతం ఖచ్చితత్వంతో కూడుకుని ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వైఆర్ 4 ఎలాంటి ఉత్పాతాన్ని సృష్టిస్తుందనే ఉత్కంఠత నెలకొంది.
ఈ గ్రహ శకలం ఢీ కొట్టడానికి గల అత్యధిక అవకాశాలు ఉన్న నగరాల్లో ముంబై, కోల్‌కత ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బొగొటా, అబిద్జాన్, లాగోస్, ఖార్టౌమ్, ఢాకా సైతం ఈ జాబితాలో ఉన్నాయి. భూ కక్ష్యకు సుదూరంగా ఈ గ్రహ శకలం ప్రయాణించడానికి ఇంకా 96.9 శాతం అవకాశం ఉందనే వాదనలు కలకలం రేపాయి అప్పట్లో.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications