సునీతకు విముక్తి- రిటర్న్ టు ఎర్త్
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు విముక్తి లభించబోతోంది. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌తో కలిసి ఇక త్వరలోనే భూమండలానికి చేరుకోనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా పూర్తి అవుతున్నాయి.
వారిని భూమ్మీదికి తీసుకుని రావడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ క్రూ- 10 కొద్ది సేపటి కిందటే ఐఎస్ఎస్‌కు చేరుకుంది. నాసాకు చెందిన అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన టకుయా ఒనిషి, రోస్కోస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్‌లతో కూడిన క్రూ-10 టీమ్ ఇక్కడ అడుగు పెట్టింది. వీళ్లు- సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్‌కు రీప్లేస్ చేస్తారు.
గత ఏడాది జూన్‌లో సునీతా విలియమ్స్ బ్యారీ బుచ్ విల్మోర్‌ను ఐఎస్ఎస్‌కు పంపించింది నాసా. నిజానికి- అది 10 రోజుల ఆపరేషన్ మాత్రమే. ఐఎస్ఎస్‌లో అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరినీ స్టార్‌లైనర్ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష కేంద్రానికి పంపింది. తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు.

స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సివచ్చింది. అదే ఏడాది జూన్ 13వ తేదీన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సమస్యల తలెత్తాయి. అప్పటికే అది ఐఎస్ఎస్‌తో అనుసంధానమైంది. సర్వీస్ మాడ్యూల్‌లో హీలియం లీక్‌తో పాటు 28 థ్రస్టర్లల్లో అయిదు పూర్తిగా పని చేయడం మానేశాయి.
ఫలితంగా- ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన సునీత విలయమ్స్, విల్మోర్‌ను భూమ్మీదికి తీసుకుని రావడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష ప్రైవేట్ పరిశోధక సంస్థ స్పేస్ ఎక్స్ సహాయాన్ని తీసుకుంది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌లో వారిని భూమికి తిరిగి తీసుకొస్తామంటూ అప్పట్లోనే నాసా వెల్లడించింది.
VIDEO | Crew-10 team - which includes NASA's Anne McClain and Nichole Ayers, Japan Aerospace Exploration Agency's Takuya Onishi and Roscosmos cosmonaut Kirill Peskov - arrives at International Space Station. The Crew-10 team will replace astronauts Sunita Williams and Barry… pic.twitter.com/sHr0FXmZIA
— Press Trust of India (@PTI_News) March 16, 2025
ఇప్పుడు తాజాగా అది కార్యరూపం దాల్చింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున 4: 33 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో ఈ డ్రాగన్ క్రూ క్యాప్సుల్ 10 స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉదయం 10 గంటల సమయంలో ఐఎస్ఎస్‌కు చేరుకుంది. ఇదే స్పేస్ క్రాఫ్ట్‌లో సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ భూమ్మీదికి తిరిగి వస్తారు.
క్రూ-10 ఆస్ట్రోనాట్స్ కొన్ని రోజుల పాటు ఐఎస్ఎస్‌లోనే గడపనున్నారు. మెటీరియల్ ఫ్లేమబిలిటి టెస్టులను నిర్వహిస్తారు. లూనార్ నేవిగేషన్ సొల్యూషన్‌పై బ్యాకప్ హార్డ్‌వేర్‌ను సిద్ధం చేస్తారు. అలాగే- హ్యామ్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులతో ఎంగేజ్ అవుతారు.
Crew 10 Dragon vehicle arriving! pic.twitter.com/3EZZyZW18b
— Don Pettit (@astro_Pettit) March 16, 2025
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications