ముందే గుర్తించారు కాబట్టి సరిపోయింది..!!
ISRO: అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఓ ప్రతిష్ఠాత్మక మిషన్ ను వాయిదా వేసుకుంది. మానవ సహిత అంతరిక్ష యాత్రకు బ్రేక్ పడింది. ఈ మిషన్ వాయిదా పడటం ఇది రెండోసారి. ఈ మిషన్ ను బుధవారానికి వాయిదా వేసుకుంది. లీకేజ్ కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పేస్ ఎక్స్, ఇస్రో వెల్లడించాయి.
ఆ మిషన్.. యాక్జియమ్ 4. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి నలుగురు వ్యోమగాములను తీసుకెళ్లడానికి ఇస్రో.. ఈ మిషన్ ను చేపట్టింది. దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారాన్ని తీసుకుంది. ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం అమెరికా ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వ్యోమగాములు ఐఎస్ఎస్ కు బయలుదేరాల్సి ఉంది.

దీనికోసం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో వాళ్లంతా అంతరిక్షంలోకి దూసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ- చివరి నిమిషంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల బుధవారానికి వాయిదా వేసుకుంది ఇస్రో. సాయంత్రం 5:30 గంటలకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ ఐఎస్ఎస్ కు వెళ్తుందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ తెలిపారు.
ఇప్పుడు మళ్లీ ఈ ప్రయోగం వాయిదా పడింది. ఫాల్కన్ 9 బూస్టర్ దశ పనితీరును పరిశీలించడానికి లాంచ్ ప్యాడ్ వద్ద ఏడు సెకన్ల పాటు హాట్ టెస్ట్ నిర్వహించింది ఇస్రో. ఆ సమయంలో ప్రొపల్షన్ బేలో ఎల్ ఓ ఎక్స్ లీకేజ్ అయింది. దీన్ని సకాలంలో గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది.
ఈ అంశంపై ఇస్రో.. స్పేస్ ఎక్స్ నిపుణులతో చర్చలు జరిపింది. ఫాల్కన్ 9 లాంచింగ్ వెహికల్ ను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి ముందే ఈ లీక్‌ను సరి చేయాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది. లీక్ ను సరిచేసిన తరువాత మరోసారి హాట్ టెస్ట్ ను నిర్వహించాలని ఇస్రో, స్పేస్ ఎక్స్ సైంటిస్టులు నిర్ణయించారు. ఫలితంగా ఆక్సిమ్ 4 ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ వెల్లడించారు.
ఈ మిషన్ కు భారత్ సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. వైమానిక దళ వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. ఈ మిషన్ కు గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరిస్తోన్నారు. ఆయనతో పాటు స్లావోష్ ఉజ్నాన్స్ కీ, టిబోర్ కపు- హంగేరి, నాసాకు చెందిన పెగ్గీ విట్సన్.. ఐఎస్ఎస్ కు వెళ్లాల్సి ఉంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications