అంతరిక్షంలో వ్యోమగామి మద్యం తాగితే ఏం జరుగుతుంది..?
మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఇష్టమైనవి తినొచ్చు.. తాగొచ్చు. మరి అంతరిక్షంలో వ్యోమగాములు మనలాగే అన్నీ తినొచ్చా..? వాళ్లు ఏం తింటారు..? తాగుతారు..? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. ఈ మేరకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(NASA) ను ట్యాగ్ చేస్తూ యువత సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ మెర్ క్యూరీ తర్వాత వ్యోమగాముల కోసం నాసా ఆహార పదార్థాలను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత చాలా సార్లు కాలానుగుణంగా మార్పులు చేస్తూనే వస్తుంది.
అంతరిక్షంలో ఆహారం తయారు చేసుకోవడం కష్టం. అలా అని ప్రతిసారీ భూమి నుంచి స్పేస్ కు ఆహారం పంపించలేము. అది చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. ముందుగా వ్యోమగాములు తీసుకెళ్లిన ఆహారాన్నే స్టోరేజ్ చేసుకుంటారు. అదీ కూడా ఎక్కువ రోజులు ఉండటం ప్రశ్నార్థకమే. అందువల్ల దీర్ఘకాలం పాటు స్పేస్ లో గడిపిన వ్యోమగాములు పౌష్టికాహార లోపంతో బాధపడతారు. అంతరిక్షంలో లో గ్రావిటీ కారణంగా వ్యోమగాముల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. వారి బలం, ఎముకలు సన్నబడతాయి. మనం భూమి మీద వయసు పెరుగుతుంటే ఎలా అవుతుందో.. వారికి అంతరిక్షంలో అలా జరుగుతుంది.
ఇక స్పేస్ లో ఆహారాన్ని శాస్త్రీయంగా ట్యూబ్స్ విధానంలో ఇస్తారు లేదా ఎండినవి.. అలాగే పేస్ట్ రూపంలో తీసుకుంటారు. ఫ్రెష్ ఫూడ్ లాంటి పండ్లు, కూరగాయలు అలాగే రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉండే పదార్థాలు అంతరిక్షంలోని రెఫ్రిజెరేటర్ లో పెట్టుకుని తినొచ్చు. ఇక బిస్కెట్స్, చాక్లెట్స్, బాదం.. సులభంగా ప్యాకేజీ చేయడమే కాక తినడానికి కూడా సులువుగా ఉంటాయి. ఇక మాంసం, డెయిరీ ప్రొడక్ట్స్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లేముందు వాటికి రేడియేషన్ ప్రక్రియ అప్లై చేస్తారు. ఇలా చేస్తే మాంసం వల్ల వ్యోమగాములకు ఇన్ ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ కాలం ఉంటాయి.

అలాగే అంతరిక్షంలోకి తీసుకెళ్లే చాలా ఆహార పదార్థాలకు హీట్ ట్రీట్ మెంట్ చేస్తారు. ఈ విధానం వల్ల అవి త్వరగా పాడవకుండా.. వాటి నుంచి వ్యోమగాములకు ఎలాంటి ఇన్ ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. ఇక లిక్విడ్ ఐటెమ్స్ కు వ్యోమగాములు కచ్చితంగా తాగాలి. ఓ బ్యాగులో స్ట్రా వేసుకుని పీల్చుకుంటూ తీసుకోవాలి. అయితే ఇవి కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ మాత్రమే. ఇక అంతరిక్షంలోకి మద్యం తీసుకెళ్లడాన్ని నాసా నిషేధించింది. వారు ఎప్పుడంటే అప్పుడు భూమికి సమాచారం ఇవ్వాలని.. అలెర్ట్ గా ఉండాలని అందుకే అంతరిక్షంలో మద్యం అనుమతిని నాసా నిషేధించింది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications