కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?: రెండు నెలలు ఆగండి, లక్షలు ఆదా చేయండి!

Car Buying Tips 2025: మీరు ఈ సమయంలో కొత్త కారు కొనాలని అనుకుంటే.. కొంచెం తొందరపడితే లక్షల్లో నష్టపోవచ్చు. అందుకే వేచి చూడటం మంచింది. కేవలం రెండు నెలల తర్వాత కొత్త కారు కొంటే.. మీరు కనీసం లక్ష రూపాయలు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు సరిగ్గానే చదివారు.. ఈ ఆదా ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. రాబోయే నెలల్లో ప్రభుత్వ జీఎస్టీ సంస్కరణలు, పండుగ సీజన్ ఆఫర్లు కారు ధరలలో భారీ తగ్గింపును తీసుకురావచ్చు. అందుకే ఇప్పుడే కారు కొనకపోవడం తెలివైన పని అని చెప్పవచ్చు.

జీఎస్టీ రేట్ల తగ్గింపు
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కార్లపై 28 శాతం జీఎస్టీ ఉంది. చిన్న కార్లపై దీనిని 18 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మార్పు అమల్లోకి వస్తే.. ఒక హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ. 40,000 నుండి రూ. 60,000 వరకు, ఒక సెడాన్ లేదా ఎస్‌యూవీ ధర రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు తగ్గవచ్చు. సెప్టెంబర్ ప్రారంభంలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ కొత్త జీఎస్టీ విధానాన్ని దీపావళికి ముందే అమలు చేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

Car Buying Tips 2025 Wait Two Months to Save Lakhs

పండుగలలో అదనపు ఆఫర్లు
భారతదేశంలో ప్రతి సంవత్సరం పండుగల సమయంలో ఆటోమొబైల్ కంపెనీలు, డీలర్‌షిప్‌లు ప్రత్యేక తగ్గింపులు, ఆఫర్లను ప్రకటిస్తాయి. గత సంవత్సరాలలో దసరా, దీపావళి పండుగల సమయంలో రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు డిస్కౌంట్లు లభించాయి. జీఎస్టీ తగ్గింపు, పండుగ ఆఫర్లను కలిపితే మొత్తం ఆదా లక్షల రూపాయలకు చేరుకోవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు
దీనికి తోడు కారు కొనేటప్పుడు బ్యాంకులు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. పండుగల సమయంలో బ్యాంకులు తరచుగా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేస్తాయి. కొన్ని సార్లు క్యాష్‌బ్యాక్ లేదా 100 శాతం వరకు రుణం కూడా ఇస్తాయి. దీనివల్ల మీ నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. ప్రారంభ ఖర్చులలో మంచి ఆదా లభిస్తుంది.

డీలర్లు, కంపెనీలు 'వెయిట్ అండ్ వాచ్' విధానంలో
ప్రస్తుతం కారు డీలర్లు పెద్ద ఎత్తున స్టాక్ ఉంచడానిక వెనుకాడుతున్నారు. దీనికి కారణం స్పష్టంగా ఉంది. ఒకవేళ జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వస్తే పాత పన్నుపై కొనుగోలు చేసిన కార్లు ఖరీదైనవిగా మారతాయి. డీలర్లకు నష్టం కలుగుతుంది. దీని వల్ల ప్రస్తుతం అమ్మకాలు తగ్గాయి. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(FADA) కూడా ఈ జీఎస్టీ సంస్కరణలను త్వరగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. లేకపోతే పండుగ సీజన్ అమ్మకాలపై ప్రభావం పడుతుందని హెచ్చరించింది.

ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభావం
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం జీఎస్టీ ఉంది. పెట్రోల్, డీజిల్ కార్లపై పన్ను 18 శాతానికి తగ్గితే.. ఈవీ, ఐసీఈ(ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) కార్ల మధ్య ధరల వ్యత్యాసం తగ్గుతుంది. ఇది ఈవీల అమ్మకాలపై ప్రభావం చూపవచ్చు. కానీ వినియోగదారులకు పెట్రోల్/డీజిల్ కార్లు మరింత అందుబాటులోకి వస్తాయి.

కొత్త కారు కొనడం అందరి కల, కానీ సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. రాబోయే రెండు నెలల్లో జీఎస్టీ తగ్గింపు, పండుగ ఆఫర్లు కలిసి ధరలను గణనీయంగా తగ్గిస్తాయి. కనుక మీరు తొందరపడకుండా కొద్దిగా వేచి చూస్తే మీ కలల కారుపై లక్షల రూపాయలు ఆదా చేసుకోవడం సాధ్యమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+