Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కారులో ఎంత పెట్రోల్ లేదా డీజిల్ నింపాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే!

కొత్త కారు కొనుగోలు చేసి వారు లేదా కారును జాగ్రత్తగా చూసుకునే వారికి ఎంత పెట్రోల్ లేదా డీజిల్ నింపాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ట్యాంకును పూర్తిగా నింపుతారు. ఇది చాలా తప్పు. చాలాసార్లు ప్రజలు కారు ఫ్యూయల్ ట్యాంక్‌ను పూర్తిగా నింపుతారు. ఇలా చేయడం సరైనదేనని వారు భావిస్తారు. ఎందుకంటే కారులో ఎప్పుడూ ఇంధనం అందుబాటులో ఉంటుంది. దానివల్ల ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే.. ఇంధనం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని అనుకుంటారు. కానీ ఇలా చేయడం సరైనది కాదు. దీనివల్ల మీకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

చాలా మంది చేసే పొరపాటు ఇది..
మీరు గమనించినట్లయితే చాలా మంది పెట్రోల్ బంకుకు వెళ్లి, తమ కారు ట్యాంక్‌ను ఫుల్ చేయమని అడుగుతారు. ఇలా చేయడం కారును బాగా చూసుకుంటున్నామని వాళ్లు భావిస్తారు. కానీ కారు ఫ్యూయెల్ ట్యాంక్‌ను ఫుల్ చేయకూడదు. దీనివల్ల మీకు ప్రయోజనం బదులుగా నష్టమే కలుగుతుంది.

Car Fuel Tank How Much Petrol or Diesel to Fill and Why Overfilling is a Mistake

ఫ్యూయెల్ ట్యాంక్‌ను ఫుల్ చేయడం వల్ల కలిగే నష్టాలు
ఫ్యూయెల్ ట్యాంక్‌ను ఫుల్ చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మీ కారు రోడ్డుపై వెళుతున్నప్పుడు బ్రేకర్లు, గుంతల వంటి ప్రదేశాల కారణంగా కారు కదులుతుంది. ఇలా కదలడం సహజమే. ఒకవేళ మీ కారు ట్యాంక్ పూర్తిగా నిండి ఉంటే.. ఇంధనం కదలడానికి ట్యాంక్‌లో చోటు ఉండదు. కారు కదలడం వల్ల ఇంధనం బయటకు చిమ్ముతుంది. దీనివల్ల చాలా ఇంధనం వృథా అవుతుంది. అలాగే మీ కారు వాలుగా ఉన్న ప్రదేశంలో నిలిపి ఉంచినట్లయితే.. అప్పుడు కూడా ఇంధనం కదలడానికి చోటు ఉండదు. అది బయటకు చిమ్ముతుంది.

మరి ఎంత పెట్రోల్ నింపాలి?
ఇప్పుడు కారులో ఎంత ఇంధనం నింపాలి అనేది తెలుసుకుందాం. ప్రతి కారు ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం వేర్వేరుగా ఉంటుంది. మీరు కంపెనీ చెప్పిన పరిమితిని పాటించినట్లయితే ఎటువంటి సమస్యలు రావు. కంపెనీ సూచించిన దాని ప్రకారం మీరు కారులో ఇంధనం నింపవచ్చు. మీకు కంపెనీ చెప్పిన పరిమితి తెలియకపోతే మీరు మరొక మార్గాన్ని ఎంచుకోవచ్చు. మీరు పెట్రోల్ నింపుతున్నప్పుడు మొదటి ఆటో-కట్ రాగానే ఇంధనం పోయడం ఆపమని ఉద్యోగికి చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల ఎటువంటి నష్టం జరగదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+