అద్భుతాలను కడుపులో దాచుకున్న చందమామ

ఆర్టెమిస్ ప్రయోగం తర్వాత విశ్వంలో ఒకదానివెంట ఒక అద్భుతాలు ఆవిష్కృతమౌతున్నాయి. ఇటీవలే చందమామకు అవతలి వైపు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. దీన్ని ఆర్టెమిస్ 2 వ్యోమగాములు స్వయంగా వీక్షించారు. మనం రోజూ చూసే చంద్రుడికి ఇవతలి వైపు కంటే ఎంతో భిన్నంగా కనిపించిందా సూర్యగ్రహణం. ఇక్కడి కంటే సుదీర్ఘ గ్రహణ కాలం అది. గ్రహణం చీకటిలో ఆర్టెమిస్ 3 నౌక ప్రయాణం ప్రారంభమైందంటే అది ఎంత భిన్నమైనదో అర్థం చేసుకోవచ్చు.

అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ఓ కొత్త అంశాన్ని కనుగొంది. చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో మంచు నిక్షేపాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని గుర్తించింది. చందమామ శాశ్వత నీడ పడే ప్రాంతం అది. అంటే సూర్యకిరణాలు ఈ ప్రాంతాన్ని అస్సలు తాకవన్నమాట. సూర్యుడి వెలుగు ప్రసరించని ప్రదేశం అది. గతంలో అదే ప్రాంతంలో చంద్రయాన్ 3ని ల్యాండ్ చేసింది ఇస్రో.

Chandrayaan-2 Data Reveal Moon Water Ice More Stable Than Thought Boosting Artemis and ISRO Missions

దీనికి సంబంధించిన సరికొత్త డేటా విశ్లేషణలపై ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) శాస్త్రవేత్తలు ' ది నేచర్' పత్రికలో ప్రచురించారు. చంద్రుడిపై సాగిస్తోన్న ప్రయోగాలు, అక్కడ చేపట్టిన అన్వేషణను ఓ మలుపు తిప్పుతుందని భావిస్తోన్నారు. చంద్రయాన్-2 మిషన్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా మంచు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

చందమామ దక్షిణ ధృవ ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ఈ పరిశోధనలు చేపట్టారు. అక్కడ లోతైన బిలాలు శాశ్వత చీకటిలో ఉంటాయి. ఉష్ణోగ్రతలు -160 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోతాయి. ఈ తీవ్ర పరిస్థితుల వల్ల అక్కడి నీటి వనరులన్నీ కూడా దట్టంగా మంచు పొరలుగా పేరుకుపోయాయి. రవి కిరణాలు సోకకపోవడం వల్ల బిలియన్ల సంవత్సరాల కొద్దీ అవి చలనం లేకుండా ఉండిపోయాయి.

హైరిజల్యూషన్ ఆర్బిట్ ఫొటోలను ఉపయోగించి 85 నుండి 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాల పరిధిలోకి శాశ్వత నీడలో ఉండే చంద్ర బిలాలను మ్యాపింగ్ చేశారు. వీటి లోతు 20 మీటర్లకు పైమాటే. దాదాపు 74 శాతం శాశ్వత నీడ ప్రాంతాలు బిలాల ప్రభావం వల్ల చెక్కుచెదరలేదని గుర్తించారు. సూక్ష్మ ఉల్కాపాతాలు సంభవించినప్పుడు చంద్రుడి ఉపరితలంపై కలిగే మార్పులు పరిమితంగానే ఉన్నాయని, అవి ఢీ కొట్టినప్పుడు మంచు నిక్షేపాలకు ఎటువంటి విఘాతం కలగలేదని తేల్చారు.

చంద్రునిపై ఉన్న నీటి మంచు ఇప్పటివరకు ఊహించిన దానికంటే దృఢంగా, అధికంగా ఉన్నాయని ఈ జర్నల్ లో పొందుపరిచారు. ఈ మంచు నిల్వలు చంద్రునిపై మానవ నివాసానికి కీలక వనరుగా మారగలవు. మంచినీరు, ఆక్సిజన్, రాకెట్లకు హైడ్రోజన్ ఇంధనాన్ని ఇవి అందిస్తాయి. చంద్రుడిపై స్థావరాలను ఏర్పాటు చేయడానికి మరింత తోడ్పడతాయని అంచనా వేశారు. బిలాలు లేని చోట్ల మంచు ఫలకలు ఉపరితలానికి మరింత దగ్గరగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+