Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చైనా.. మనతో పోటీనా?

China: అంతరిక్ష పరిశోధనల్లో డ్రాగన్ కంట్రీ చైనా మరో అడుగు ముందుకేసింది. ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపించింది. ఈ ముగ్గురూ- చైనా సొంతంగా నిర్మించుకున్న అంతరిక్ష పరిశోధన కేంద్రం టియాంగ్యాంగ్‌ను చేరుకున్నారు. ఆరు నెలల పాటు అక్కడే ఉంటారు. తమ ప్రయోగాల్లో భాగంగా స్పేస్ వాక్ సైతం చేస్తారు.

ఈ ముగ్గురు వ్యోమగాములు- కమాండర్ కై గ్ఝుఝె, వైమానిక దళ మాజీ పైలెట్ సొంగ్ లింగ్డాంగ్, స్పేస్ ఫ్లైట్ ఇంజినీర్ వాంగ్ హౌజెను మోసుకుంటూ చైనా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం సరిగ్గా 4:27 నిమిషాలకు షెన్ఝౌ 19 స్పేస్ క్రాఫ్ట్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీనికోసం లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్‌ను ఉపయోగించింది.

China launched the Shenzhou-19 crewed spaceship sending 3 astronauts

ప్రయోగించిన సమయం నుంచి ఆరున్నర గంటల తరువాత తియాంగ్యాగ్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుందని, దానితో అనుసంధానం విజయవంతమైందన చైనా ప్రకటించింది. టియాన్హే కోర్ మాడ్యూల్‌తో ఈ స్పేస్ క్రాఫ్ట్ లింక్ అయినట్లు వెల్లడించింది. ఈ ఆరు నెలల కాలంలో ఈ ముగ్గురు వ్యోమగాములు స్పేస్ వాక్ చేస్తారు.

చైనా అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇది 33వ ప్రయోగం. అన్‌క్రూడ్ టెస్ట్ ఫ్లైట్లు, క్రూడ్ మిషన్లు, టియాంగాంగ్ మాడ్యూల్స్ లాంచ్ చేయడం, తేలికపాటి స్పేస్ ల్యాబ్ మిషన్లను ఇదివరకు ప్రయోగించింది. స్పేస్‌క్రాఫ్ట్ టెస్ట్ ఫ్లైట్స్, టియాన్‌జౌ కార్గో, రీఫ్యూయలింగ్ మిషన్స్ సైతం ఇందులో ఉన్నాయి.

టియాంగ్యాంగ్ పరిశోధన కేంద్రాన్ని మరింత విస్తరించాలనుకుంటోంది చైనా. దీనికి గల సాధ్యసాధ్యాలపై ఈ ముగ్గురు వ్యోమగాములు అధ్యయనం చేస్తారు. దీనికి అవసరమైన ప్రాథమిక కార్యకలాపాలనూ పూర్తి చేసుకుంటారు. అవసరమైన డేటాను ఎప్పటికప్పుడు గ్రౌండ్ స్టేషన్‌కు పంపిస్తారు.

China launched the Shenzhou-19 crewed spaceship sending 3 astronauts

చంద్రుడిపైనా మనుషులను పంపించాలని చైనా ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. భూమికి 3,80,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలను చేయాలని ఎప్పటినుంచో ప్రణాళికలను వేస్తూ వస్తోంది. టియాంగ్యాంగ్ స్పేస్ సెంటర్ నుంచే దీన్ని చేపట్టాలని భావిస్తోంది.

కాగా 2035 నాటికి భారత్ సైతం సొంతంగా అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి భారతీయ అంతరిక్ష్ స్టేషన్ అని నామకరణం చేసింది. చంద్రుడిపై ప్రయోగాలు సాగించడానికి గగన్‌యాన్ మిషన్లనూ చేపట్టింది. చంద్రయాన్ 3నీ విజయవంతం చేసింది. ఇప్పుడు అదే బాటలో చైనా నడుస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+