ఇకపై అంతరిక్షంలోనూ బట్టలు ఉతకొచ్చు.. చైనా సరికొత్త వాషింగ్ మెషీన్!

అంతరిక్షంలో వ్యోమగాములు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వారు అనేక విషయాలకు అలవాటు పడాల్సి ఉంటుంది. వ్యోమగాములకు ఎదురయ్యే అతిపెద్ద సమస్యలో ఒక పరిశుభ్రత. గంటల తరబడి ఒకే దుస్తులను ధరించడం, వాటిని శుభ్రం చేయలేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు ఈ సమస్యకు ఓ పరిష్కారానని కనుగొన్నారు. సైంటిస్టులు ఓ చిన్న, డిటర్జెంట్ అవసరం లేని సరికొత్త వాషింగ్ మెషీన్‌ను తయారు చేశారు. ఈ వాషింగ్ మెషీన్ నీటిని ఉపయోగించకుండానే ఆవిరి, ఓజోన్‌తో బట్టలను శుభ్రం చేస్తుంది.

ఈ వాషింగ్ మెషీన్ ఎలా పని చేస్తుందంటే?
ఈ సరికొత్త వాషింగ్ మెషీన్ డిటర్జెంట్లకు బదులుగా ఓజోన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఓజోన్‌ను అతినీలలోహిత కాంతి ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఓజోన్‌ ఓ శక్తివంతమైన క్రిమిసంహారికారి కావడంతో ఇది బట్టలపై ఉండే సూక్ష్మక్రిములను సమర్థవంతంగా తొలగిస్తుంది. అంతేకాకుండా ఈ వాషింగ్ మెషీన్ బట్టలను శుభ్రం చేయడానికి నీటిని కూడా ఇది ద్రవ రూపంలో ఉపయోగించదు. బదులుగా, కేవలం 400 మిల్లీలీటర్ల నీటిని అల్ట్రాసోనిక్ అటామైజేషన్ పద్ధతి ద్వారా అతి సన్నని ఆవిరిగా మార్చి ఉపయోగిస్తుంది. ఈ ఆవిరి బట్టల కణాల మధ్యలోకి చొచ్చుకుపోయి, దుమ్ము, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

China s New Space Washing Machine Wash Clothes in Zero Gravity

ఈ సరికొత్త వాషింగ్ వివరాలు ఇలా..
చైనా వ్యోమగామి పరిశోధన అండ్ శిక్షణా కేంద్రం (CARTC) తయారు చేసిన ఈ వాషింగ్ మెషిన్ సుమారు 12 కిలోల బరువు ఉంటుంది. ఇది ఒక చిన్న క్యూబ్ ఆకారంలో ఉంటుంది. ఇది చిన్న సూట్‌కేస్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. దీని ద్వారా ఒక్కో సైకిల్‌లో 800 గ్రాముల బట్టలను సులభంగా శుభ్రం చేయవచ్చు. ఈ వాషింగ్ మెషీన్‌తో దుస్తులు 5 సార్లు ధరించినప్పటికీ శుభ్రంగా ఉంటాయి. ఈ వాషింగ్ మెషీన్ అంతరిక్ష ప్రయాణాలను సులభతరం చేయడమే కాకుండా.. వ్యోమగాముల ఆరోగ్యానికి కూడా భరోసా ఇస్తుంది. భవిష్యత్తులో ఈ సాంకేతికత భూమిపైనా పర్యావరణహిత వాషింగ్ మెషిన్ల తయారీకి ప్రేరణగా మారవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+