అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనాలు- ఇక విప్లవాత్మక మార్పులు

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో ఘనతను సాధించింది. అంతరిక్షంలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ విజయవంతమైనట్లు ప్రకటించింది. మున్ముందు అనేక విప్లవాత్మక మార్పులకు ఈ ప్రయోగం కేంద్రబిందువు కాగలదని అంచనావేసింది.

డిసెంబర్ 30వ తేదీన రాత్రి తిరుపతి జిల్లాలని శ్రీహరికోటలో గల షార్ సెంటర్ నుంచి స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. పోలార్ సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ) ద్వారా వాటిని విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మొత్తం 14 పేలోడ్స్ అంతరిక్షంలోకి వెళ్లాయి.

Cowpea seeds have germinated under microgravity conditions says ISRO

ఈ పేలోడ్స్‌లో భాగమైన పీఎస్4- ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యుల్‌‌ ప్రస్తుతం నాలుగో దశలో ప్రవేశించింది. భూమికి 350 కిలో మీటర్ల ఎత్తులో కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ మాడ్యుల్‌లో చేర్చిన ఎనిమిది కౌపీ విత్తనాల ఇప్పుడు మొలకెత్తినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఓ ట్వీట్ పోస్ట్ చేసింది.

కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యుల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్‌ (క్రాప్స్) కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. అంతరిక్షంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరుగుతాయనే విషయంపై అధ్యయనం చేయడానికి, భవిష్యత్తులో దీర్ఘ-కాల అంతరిక్ష మిషన్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.

అంతరిక్షంలోకి పంపిన నాలుగు రోజుల్లోనే మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో కూడా ఈ కౌపీ విత్తనాలు మొలకెత్తాయని ఇస్రో వివరించింది. దీనికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అందించినట్లు పేర్కొంది. ఈ విత్తనాలు యాక్టివ్ థర్మల్ కంట్రోల్‌లో ఉండే క్లోజ్డ్-బాక్స్‌లో ఉన్నట్లు తెలిపింది.

పరిమితంగా ఉండే వాతావరణ పరిస్థితుల మధ్య యాక్టివ్ థర్మల్ రెగ్యులేషన్‌తో ఎనిమిది కౌపీ విత్తనాల పెంపకం అత్యంత సవాళ్లతో కూడుకున్న ప్రయోగంగా అభివర్ణించింది ఇస్రో. అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తడం, ఆ మొక్కలను కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేక చర్యలను తీసుకుంటోన్నామని, ఆకుల దశకు చేరుకునే వరకు సంరక్షించాల్సి ఉంటుందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+