Digital Condom: ఎలా పని చేస్తుంది? ఉపయోగాలేంటీ?
డిజిటల్ కండోమ్.. సెక్స్ చేస్తోన్న సమయంలో దాన్ని అనుమతులు లేకుండా చిత్రీకరించడం, మాటలను రికార్డ్ చేయడం, ఫొటోలు తీయడాన్ని నిరోధించడానికి కొత్తగా అందుబాటులోకి వచ్చిన యాప్ ఇది. జర్మనీకి చెందిన బిల్లీ బోయ్ అనే సెక్సువల్ హెల్త్ కేర్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది.
పోర్నోగ్రఫీ, సైబర్ క్రైమ్, రహస్య కెమెరాలు లేదా స్మార్ట్ ఫోన్ల ద్వారా సన్నిహిత దృశ్యాలను చిత్రీకరించడం, వాటిని పోర్న్ సైట్‌లకు విక్రయించి సొమ్ము చేసుకోవడం, ఆ వీడియోలను ఆధారంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడటం వంటి.. చర్యలు విచ్చలవిడిగా పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ కండోమ్ వంటి యాప్ అవసరం ఉందని బిల్లీ బోయ్ సంస్థ అభిప్రాయపడింది.

దీనికి కామ్‌డోయ్ యాప్ అని పేరు పెట్టిందా కంపెనీ. ఒకే సమయంలో సీక్రెట్ కెమెరాలు మైక్రోఫోన్లను స్తంభింపజేస్తుందీ యాప్. యూజర్లు దీన్ని బ్లూటూత్‌తో తమ స్మార్ట్ ఫోన్లకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. సెక్స్‌లో పాల్గొనడానికి ముందు తమ స్మార్ట్ ఫోన్‌ను దగ్గరగా ఉంచుకోవడం, వర్చువల్ బటన్‌ను స్వైప్ చేయడం ద్వారా డిజిటల్ కండోమ్ యాప్‌ను యాక్టివేట్ చేయవచ్చు.
తమ శృంగార సన్నివేశాలను ఎవరైనా రహస్యంగా చిత్రీకరించడం లేదా మాటలను రికార్డ్ చేయడం, ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తే వెంటనే స్మార్ట్ ఫోన్‌లో అలారం మోగుతుంది. సెక్స్ చేసే ముందు యాప్‌ని ఓపెన్ చేస్తే సీక్రెట్ కెమెరాలు, మైక్రోఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైనా కనెక్ట్ అయ్యాయో లేదో వెంటనే తెలిసిపోతుంది.
అలాంటి గాడ్జెట్స్‌ను ఈ యాప్ వెంటనే గుర్తిస్తుంది. యూజర్లను బీప్ సౌండ్ లేదా అలారం ద్వారా హెచ్చరిస్తుంది. ఆ గాడ్జెట్స్‌ను షడౌన్ చేస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నట్లు డెవలపర్ ఫిలపె అల్మెడా వెల్లడించారు. ఈ యాప్ సోషల్ మీడియాల్ హాట్ హాట్‌గా డిబేట్ సాగుతోంది.












Click it and Unblock the Notifications