Space News: అంతరిక్షయానంలో కొత్త టార్గెట్ సెట్ చేసిన స్పేస్ X.. మస్క్ ట్వీట్ వైరల్
Elon Musk: శాస్త్ర, సాంకేతిక రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. అసాధ్యం అనుకున్న ప్రతిదాన్నీ సుసాధ్యం చేస్తూ మానవుడిలో దాగి ఉన్న ప్రతిభకు మరింత పదును పెడుతోంది. ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టేందుకు వందల సార్లు ఫెయిల్ అయ్యారనీ, చివరికి తన కలను సాకారం చేసుకున్నారని చదివాం. ఇదే కోవకి చెందిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌ను ఇప్పుడు చూస్తున్నాం.
ఎలాన్ మస్క్ 'స్పేస్ X' పేరిట అంతరిక్ష ప్రయోగాలను చేపడుతుండటం తెలిసిందే. అయితే చాలాసార్లు అవి ఫెయిల్ అయ్యి నిరాశనే మిగిల్చాయి. అయినా సరే లక్ష్యాన్ని సాధించే వరకు వెనకడుగు వేయకుండా ఎలాన్ మస్క్ కంపెనీ ప్రయత్నిస్తూనే ఉంది. ఎట్టకేలకు చరిత్ర సృష్టిస్తూ ఓ అసాధారణ ఫీట్ సాధించింది. ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి సురక్షితంగా లాంచ్ ప్యాడ్‌లో ప్రవేశపెట్టగలిగింది.

టెక్సాస్‌లోని బోకా చికా నుండి లిఫ్ట్-ఆఫ్ అయిన 7 నిమిషాల తర్వాత లాంచ్ ప్యాడ్ మెకానికల్ హ్యాండ్స్‌కు రాకెట్ చిక్కింది. ఈ సూపర్ హెవీ రాకెట్‌ను గంటలోపు తిరిగి ప్రయోగించవచ్చని ఎలాన్ మస్క్ ప్రకటించారు. స్టార్‌షిప్ రాకెట్ ఐదవ టెస్ట్ ఫ్లైట్ సమయంలో ఈ బూస్టర్ విజయవంతంగా రికవరీ అయి కీలక విజయం సాధించినట్లు పేర్కొన్నారు. రికవరీ కోసం సముద్రపు ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడకుండా స్పేస్‌ఎక్స్ తన లాంచ్ ప్యాడ్‌తో బూస్టర్‌ను నేరుగా పట్టుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
'ఇప్పుడే స్టార్‌షిప్ బూస్టర్‌ను తనిఖీ చేసాను. రాకెట్ దాని లాంచ్ మౌంట్‌లో తిరిగి ఉంచబడింది. ఇది చాలా బాగుంది. కొన్ని ఔటర్ ఇంజన్ నాజిల్‌లు వేడెక్కాయి. చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వీటిని సులభంగా పరిష్కరించవచ్చు. వేగవంతమైన రీ-ఫ్లైట్ సామర్థ్యాలను సాధించాలనే స్పేస్ X లక్ష్యానికి బూస్టర్ క్విక్ రిటర్న్ చాలా కీలకం. లిఫ్ట్-ఆఫ్ తర్వాత ఒక గంటలోపే తిరిగి రావడం ఆనందంగా ఉంది' అని మస్క్ సోషల్ మీడియాలో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు.












Click it and Unblock the Notifications