హోండా యాక్టివా 125 vs సుజుకి యాక్సెస్ 125: ఏది బెస్ట్?
Honda Activa vs Suzuki Access: కొత్త స్కూటర్ కొనుగోలు చేసేవారు చాలా ఫీచర్లు, మైలేజ్, ధరలను ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల కాలంలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్న స్కూటర్లలో హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125 మధ్య ఎంపిక సాధారణంగా ఎదురవుతుంది. ధరలు, ఫీచర్లు దాదాపు ఒకే విధంగా ఉన్నా.. ఈ రెండు జపనీస్ దిగ్గజాల మధ్య తేడాలు ఏంటి? దేన్ని ఎంచుకోవాలి అనే అంశంపై 'వన్ ఇండియా తెలుగు' జరిపిన సమగ్ర విశ్లేషణ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
భారత మార్కెట్లో హోండా యాక్టివాను ఎక్కువగా విశ్వసిస్తారు. యాక్టివా పేరు వింటేనే విశ్వసనీయత, దీర్ఘకాలిక మన్నిక గుర్తుకొస్తాయి. అయితే గణాంకాల పరంగా చూస్తే.. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న 125 సీసీ స్కూటర్ మాత్రం సుజుకి యాక్సెస్ 125. ఈ రెండింటిలో ఏది ఎంచుకున్నా.. ఈ రెండూ జపనీస్ ఇంజనీరింగ్‌తో వస్తాయి కాబట్టి.. మీకు స్మూత్‌గా, రిఫైన్ఢ్‌గా ఉండే, నమ్మదగిన స్కూటర్‌ను అందిస్తాయని అనడంలో సందేహం లేదు.

ఈ రెండు స్కూటర్ల మధ్య తేడా ఇదే.
ఈ రెండు స్కూటర్ల నడిపే అనుభవంలోనే ప్రధాన తేడా ఉంది. హోండా యాక్టివా స్మూత్‌నెస్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. సుజుకి యాక్సెస్ 125 పనితీరు, పవర్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. హోండా యాక్టివా వేగం, పనితీరు యాక్సెస్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ యాక్టివా నగరంలో నెమ్మదిగా నడపడానికి అనుకూలంగా ఉంటుంది. యాక్సెస్ పనితీరుతో పాటు అవసరమైనప్పుడు మంచి పవర్ లభిస్తుంది. నడపడానికి మరింత ఆనందదాయకంగా ఉంటుంది. యాక్టివా, యాక్సెస్ స్కూటర్లు రెండింటీలోనూ మైలేజీ సంతృప్తికరంగానే ఉండటంతో పాటు మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. యాక్టివా నడపడం ఒక ప్రశాంతమైన అనుభూతిని ఇస్తే, యాక్సెస్ నడపడం కొంచెం ఉత్సాహంగా, చురుకుగా ఉంటుంది.
ఫీచర్లు, ధర
రెండు మోడళ్ల ధరలు దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ అనేది వీటి మధ్య ఎంపికకు పెద్దగా కారణం కాదు. రెండూ ఆధునిక ఫీచర్లతో వస్తాయి. టాప్ వేరియంట్లలో TFT డిస్‌ప్లేలు, డిజిటల్ కన్సోల్‌లు లభిస్తాయి. హోండా యాక్టివాలో అదనంగా కీలెస్ ఆప్షన్ అందుబాటులో ఉంది. భద్రత దృష్ట్యా, కొనుగోలుదారులు తప్పనిసరిగా ముందువైపు డిస్క్ బ్రేక్ ఉన్న వేరియంట్‌ను ఎంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
అంతిమ సిఫార్సు
సుజుకి యాక్సెస్ 125 ఇది ఒక అద్భుతమైన ఆల్ రౌండర్‌గా నిలుస్తుంది. ఇది స్మూత్ రైడింగ్, మంచి మైలేజ్, అవసరమైనప్పుడు ఉత్తమమైన పవర్ అందిస్తుంది. అందుకే, మెరుగైన రైడింగ్ అనుభవం, పనితీరును కోరుకునే వారికి యాక్సెస్ 125 కొనుగోలు చేయవచ్చు. హోండా యాక్టివా 125 పట్టణాల్లో నడపడానికి అనుకూలంగా ఉండడంతో పాటు సులభమైన సర్వీసింగ్, విస్తృత నెట్‌వర్క్‌కు ప్రాధాన్యత ఇస్తే యాక్టివా ఒక మంచి ఎంపిక. మెరుగైన పనితీరు, పవర్, మైలేజ్ కోసం చూస్తున్నట్లయితే సుజుకి యాక్సెస్‌ను.. కేవలం అత్యుత్తమ స్మూత్‌నెస్, హోండా బ్రాండ్ నమ్మకాన్ని కోరుకుంటే యాక్టివాను ఎంచుకోవచ్చు. రెండు స్కూటర్లు కూడా అద్భుత ఫీచర్లు కలిగి ఉన్నాయి. మంచి రైడింగ్ అనుభవాన్ని ఇస్తాయి. కాబట్టి మీకు కావాల్సిన ఫీచర్ల ప్రకారం ఆ స్కూటరును ఎంచుకోండి.












Click it and Unblock the Notifications