Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరదల్లో కారు లేదా బైక్ పాడైందా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి!

దేశంలోని చాలా ప్రాంతాలు వరదల బారిన పడుతున్నాయి. దీని ప్రభావం సాధారణ ప్రజల వాహనాలపై ఎక్కువగా ఉంది. వరద నీటిలో చిక్కుకోవడం వల్ల కార్లు, బైకుల ఇంజిన్, ఎలక్ట్రికల్ సిస్టమ్, ఇతర భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో మీ వాహనం కూడా పాడైతే భయపడాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ద్వారా మీరు నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియను సులభంగా అర్థం చేసుకుందాం.

ముందు జాగ్రత్తలు.. నష్టం అంచనా
ముందుగా మీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. వరద నీటిలో ఉన్న వాహనాన్ని అస్సలు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించవద్దు. అలా చేయడం వల్ల ఇంజిన్‌‌కు మరింత ఎక్కువ నష్టం జరుగుతుంది. వాహనాన్ని సురక్షితమైన ప్రదేశానికి తరలించి, ఇంజిన్‌‌లో లేదా ఎలక్ట్రికల్ సిస్టమ్ లోకి నీరు చేరిందా లేదా అని తనిఖీ చేయండి.

How to Claim Insurance for a Car or Bike Damaged in Floods Step-by-Step Guide

ఇన్సూరెన్స్ కంపెనీకి తక్షణమే సమాచారం ఇవ్వండి..
ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి మీ ఇన్సూరెన్స్ కంపెనీకి వీలైనంత త్వరగా తెలియజేయాలి. సంఘటన జరిగిన 24-48 గంటల్లోగా సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు హెల్ప్ లైన్ నంబర్, కంపెనీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా క్లెయిమ్‌ను నమోదు చేయవచ్చు. సమాచారం ఇచ్చేటప్పుడు పాలసీ నంబర్, వాహనం వివరాలు, నష్టం జరిగిన తేదీ, కారణాన్ని కచ్చితంగా తెలియజేయండి.

అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి
క్లెయిమ్ చేసేందుకు కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం. వాటిని సిద్ధంగా ఉంచుకోండి:

*ఇన్సూరెన్స్ పాలసీ కాపీ
*వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)
*డ్రైవింగ్ లైసెన్స్
*FIR కాపీ (కొన్ని సందర్భాల్లో)
*నష్టం జరిగిన చోట తీసిన ఫొటోలు/వీడియోలు
*గ్యారేజ్ నుంచి అంచనా వేసిన మరమ్మతు బిల్లు

సర్వేయర్ తనిఖీ.. క్లెయిమ్ సెటిల్మెంట్
మీ ఫిర్యాదు నమోదు అయిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సర్వేయర్‌ను నియమిస్తుంది. ఆ సర్వేయర్ మీ వాహనాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తాడు. ఆ నివేదిక ఆధారంగానే క్లెయిమ్ మొత్తం నిర్ణయించబడుతుంది. సర్వేయర్ పరిశీలన పూర్తయ్యాకే మరమ్మతులు ప్రారంభించడం మంచిది. సర్వేయర్ నివేజదిక వచ్చిన అనంతరం ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌ను ఆమోదిస్తుంది. మీ పాలసీలో క్యాష్‌లెస్ సదుపాయం ఉంటే కంపెనీతో టైఅప్ ఉన్న గ్యారేజ్‌లో వాహనాన్ని రిపేర్ చేయించుకోవచ్చు. ఆ బిల్లును నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ క్యాష్‌లెస్ సదుపాయం లేకపోతే, మీరు ముందుగా డబ్బు చెల్లించి, తర్వాత కంపెనీ నుంచి ఆ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.

సరళంగా చెప్పాలంటే.. వరదల్లో పాడైన వాహనానికి నష్టాన్ని పూర్తిగా కవర్ చేసుకోవచ్చు. అయితే సమయానికి సమాచారం ఇవ్వడం, సరైన పత్రాలను సమర్పించడం చాలా ముఖ్యం. ఈ పద్ధతిని అనుసరిస్తే మీ క్లెయిమ్ ప్రక్రియ సులభతరం అవుతుంది, మీకు పూర్తి డబ్బు తిరిగి లభిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+