టైమ్ ల్యాప్స్ వీడియో: ముంచుకొస్తోన్న రాకాసి విపత్తు
Hurricane Milton: అమెరికా వరుస హరికేన్లతో అతలాకుతలమౌతోంది. రెండు వారాల వ్యవధిలో మరో అతి పెద్ద హరికేన్‌ను ఎదుర్కొనబోతోంది. కిందటి నెల చివరివారంలో హెలెన్ హరికేన్‌తో అల్లకల్లోలానికి గురైంది. దాని తీవ్రత ముగిసిన అతి కొద్ది రోజుల్లోనే మరో రాకాసి హరికేన్‌ను ఎదుర్కొనబోతోంది.
కిందటి నెల 27, 28 తేదీల్లో హెలెన్ హరికేన్ విరచుకుపడింది అమెరికాపై. దీనివల్ల ఫ్లోరిడా తీవ్రంగా దెబ్బతిన్నది. దీని బారిన పడి 43 మంది మరణించారు. ఫ్లోరిడా సహా జార్జియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, వర్జీనియా.. వంటి రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వేలాదిమంది ప్రభావితం అయ్యారు.

ఇప్పుడు తాజాగా మిల్టన్ హరికేన్ పంజా విసరబోతోంది. అదే ఫ్లోరిడా వద్ద తీరాన్ని తాకబోతోంది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జామున టంపా వద్ద తీరం దాటొచ్చని నేషనల్ హరికేన్ సెంటర్ అంచనా వేసింది. ఏకంగా 15 అడుగుల ఎత్తు వరకు వరద పోటెత్తవచ్చని హెచ్చరించింది.
దీన్ని కేటగిరి 5లోకి చేర్చింది నేషనల్ హరికేన్ సెంటర్. అత్యధిక విధ్వంసాన్ని సృష్టించగల హరికేన్లను మాత్రమే ఈ కేటగిరీలో చేర్చుతుంటుంది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది ఫ్లోరిడా అధికార యంత్రాంగం. స్థానికులను అప్రమత్తం చేసింది.
Timelapse flying by Hurricane Milton about 2 hours ago.
— Matthew Dominick (@dominickmatthew) October 8, 2024
1/6400 sec exposure, 14mm, ISO 500, 0.5 sec interval, 30fps pic.twitter.com/p5wBlC95mx
టంపా బే ఏరియా మొత్తం ఖాళీ అయింది. అక్కడున్న షాపులను మూసివేశారు. హరికేన్ తీరాన్ని దాటే సమయంలో 165 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఫ్లోరిడా దక్షిణ ప్రాంతంలో ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించారు.
Timelapse from our cameras on the International Space Station (ISS) shows the eye of Hurricane Milton.
— sen (@sen) October 8, 2024
Travelling across the Gulf of Mexico on 08 October 2024 pic.twitter.com/oR1dLwzWPf
మిల్టన్ హరికేన్ ట్రాకింగ్‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చిత్రీకరించారు అక్కడి నాసా సైంటిస్ట్ మాథ్యూ డొమెనిక్. దీన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. హరికేన్ ఐ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఆవరించి ఉందా హరికేన్. తీర ప్రాంతం మొత్తం దీని వల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications